
విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పై మరో జీవో జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం. డిఏ అరియర్స్ రిటైర్ అయ్యాక చెల్లిస్తామన్న నిబంధన వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం. అరియర్స్ 10 శాతం 2026 ఏప్రిల్ లో చెల్లిస్తామని వెల్లడించింది.
90 శాతం అరియర్స్ 2026 ఆగస్ట్, నవంబర్, 2027 ఫిబ్రవరిలో చెల్లిస్తామని తెలిపింది. ఉద్యోగుల జి పి ఎఫ్ లో జమ చేస్తామని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.