
సాక్షి,అమరావతి: మీడియాపై హోంమంత్రి తీవ్ర అనిత అసహనం వ్యక్తం చేశారు.పవన్ వద్ద భీమవరం డీఎస్పీ పేకాట పంచాయితీపై మీడియా ప్రశ్నించింది. సమాధానం చెప్పలేక మీడియాపై హోంమంత్రి ఎదురుదాడికి దిగారు. పవన్ సలహాలు ఇవ్వడంలో తప్పులేదు. మాకు మాకు లేని ఈగోలు మీకెందుకు?.ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. మా మధ్య అండర్ స్టాండింగ్ ఉంది. ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేస్తున్నాం’ అంటూ మీడియాపై ఫైరయ్యారు.
అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు పేకాట పంచాయితీ చేరింది. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పవన్‌కు జనసేన నేతల ఫిర్యాదు చేశారు. సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకుంటున్నారని, భీమవరం పరిధిలో పేకాట శిబిరాలు ప్రోత్సహిస్తున్నారని డీఎస్పీపై పవన్‌కు చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులపై పవన్ స్పందించారు. కూటమి నేతల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన ..డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలపాలని అధికారులకు ఆదేశాలు చేశారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఎస్పీకి ..పవన్ ఆదేశించారు.
ఈ ఆదేశాలు,పవన్ జోక్యం వంటి అంశాలపై మీడియా హోంమంత్రి అనితను ప్రశ్నించింది. పేకాట పంచాయితీలో మాకు లేని ఈగోలు మీకెందుకు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
👉ఇదీ చదవండి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు ‘పేకాట పంచాయితీ’