దేవుడిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలా? | - | Sakshi
Sakshi News home page

దేవుడిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలా?

Jan 30 2026 6:48 AM | Updated on Jan 30 2026 6:48 AM

దేవుడిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలా?

దేవుడిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలా?

దేవుడిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలా?

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు వేంకటేశ్వరస్వామికి క్షమాపణలు చెప్పాలి మాజీ మంత్రి అంబటి రాంబాబు

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌) : కలియుగ దేవుడు వేంకటేశ్వరస్వామి లడ్డూ విషయంలో చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ చేసిన రాజకీయాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాజకీయాల కోసం వేంకటేశ్వరస్వామిని వాడుకోవటం ధర్మం కాదన్నారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యంత పవిత్రమైన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపణలు చేశారని, ఆఖరికి సుప్రీం కోర్టు నియమించిన సిట్‌, లడ్డూలో ఎటువంటి కొవ్వు కలవలేదని తేల్చిచెప్పిందన్నారు. పవిత్రమైన ఆలయంలో.. చంద్రబాబు అపవిత్రమైన రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ వ్యవహరించిన తీరుపై ఆత్మ పరిశీలన చేసుకొని వేంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్‌ నూరిఫాతిమా, పలు అనుంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement