జాతీయ స్థాయిలో గుంటూరు వైద్యుడి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయిలో గుంటూరు వైద్యుడి ప్రతిభ

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

జాతీయ స్థాయిలో గుంటూరు వైద్యుడి ప్రతిభ

జాతీయ స్థాయిలో గుంటూరు వైద్యుడి ప్రతిభ

గుంటూరు మెడికల్‌: వెన్నుముక పరిశోధనల్లో జాతీయ స్థాయిలో గుంటూరు వైద్యుడు ప్రతిభ చూపించి రెండు జాతీయ అవార్డులు ఒకేసారి సొంతం చేసుకుని అరుదైన రికార్డు సృస్టించారు. గుంటూరుకు చెందిన సీనియర్‌ స్పయిన్‌ సర్జన్‌, మల్లిక సెంటర్‌ అధినేత డాక్టర్‌ జె.నరేష్‌బాబు వెన్నుపై చేసిన పరిశోధనలకు రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆదివారం గుంటూరు కొత్తపేటలోని మల్లిక స్పయిన్‌ సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు ఆయన మీడియాకు వెల్లడించారు.

ప్రతిష్టాత్మక అస్సి బేసిక్‌ స్పయిన్‌ రీసెర్చ్‌ అవార్డు ..

అసోసియేషన్‌ ఆఫ్‌ స్పయిన్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా గత వారం పూణేలో నిర్వహించిన స్పయిన్‌ సర్జన్స్‌ 2026 జాతీయ సదస్సులో మల్లిక స్పయిన్‌ సెంటర్‌ అరుదైన ఘనత సాధించింది. ఎంఆర్‌ఐలో కంటికి కనిపించని మార్పులను రేడియోమిక్స్‌అనే ఆర్టిఫి షల్‌ ఇంటెలిజెన్స్‌ విధానాన్ని వాడడం ద్వారా డిస్క్‌ అరుగుదలను ముందుగానే గుర్తించి నివారణోపాయాలను సూచించవచ్చు అని నిరూపించిన పరిశోధనకు అత్యంత ప్రతిష్టాత్మక అస్సి బేసిక్‌ స్పయిన్‌ రీసెర్చ్‌ అవార్డు 2026ను నరేష్‌ బాబు అందుకున్నారు. బేసిక్‌ స్పయిన్‌ రీసెర్చ్‌ అవార్డు తో పాటు క్లినికల్‌ స్పయిన్‌ రీసెర్చ్‌ అవార్డు కూడా మల్లిక స్పయిన్‌ సెంటర్‌ గెలుచుకోవడం విశేషం. ఒకే సమయంలో ఈ రెండింటినీ సొంతం చేసుకున్న తొలి స్పయిన్‌ సెంటర్‌గా గుంటూరు మల్లిక స్పయిన్‌ సెంటర్‌ రెండు తెలుగు రాష్ట్రాలలో చరిత్ర సృష్టించింది. సదస్సులో మల్లిక స్పయిన్‌ సెంటర్‌ నుంచి మొత్తం 11 పోడియం ప్రెజెంటేషన్లు జరగడం విశేషం. ఈ సందర్భంగా మల్లిక స్పయిన్‌ సెంటర్‌ చీఫ్‌ ఆఫ్‌ స్పయిన్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ జె.నరేష్‌ బాబు మాట్లాడుతూ ఈ విజయాలు మొత్తం వైద్య బృందం, సహాయక సిబ్బంది అందరి కృషికి ప్రతిఫలమని పేర్కొన్నారు. అవార్డు గెలుచుకున్న తమ విద్యార్థి డాక్టర్‌ పృథ్వీకుమార్‌ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

అరుదైన రికార్డు సృష్టించిన

స్పయిన్‌ సర్జన్‌ డాక్టర్‌ నరేష్‌బాబు

ఒకేసారి రెండు జాతీయ అవార్డులు

సొంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement