ముగిసిన అంతర కళాశాలల చదరంగం పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన అంతర కళాశాలల చదరంగం పోటీలు

Jan 30 2026 6:48 AM | Updated on Jan 30 2026 6:48 AM

ముగిసిన అంతర కళాశాలల  చదరంగం పోటీలు

ముగిసిన అంతర కళాశాలల చదరంగం పోటీలు

ముగిసిన అంతర కళాశాలల చదరంగం పోటీలు ● పురుషుల జట్టు ప్రథమ స్థానంలో ఆర్‌వీఆర్‌ ఇంజినీరింగ్‌, ద్వితీయ స్థానంలో బాపట్ల ఇంజినీరింగ్‌, తృతీయ స్థానంలో జేకేసీ కళాశాల, నాలుగవ స్థానంలో చలపతి ఫార్మశీ జట్లు నిలిచాయి. ● మహిళల విభాగంలో ప్రథమ లాం చలపతి ఫార్మశీ, ద్వితీయ స్థానంలో ఆర్‌వీఆర్‌, 3,4 స్థానాల్లో బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల జట్లు నిలిచాయి. విజేతలను పలువురు అభినందించారు.

విజేతలకు బహుమతులు పంపిణీ

తాడికొండ: మోతడక చలపతి ఫార్మశీ కళాశాలలో రెండు రోజులుగా కొనసాగుతున్న ఏఎన్‌యు అంతర కళాశాలల చదరంగం పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎన్‌యు యోగా కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ డి. సూర్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు చదరంగం దోహదం చేస్తుందన్నారు. అనంతరం చలపతి విద్యా సంస్థల కార్యదర్శి వై సుజిత్‌తో కలిసి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో గుంటూరు ధనలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సీహెచ్‌. వెంకటరావు, చలపతి ఫార్మశీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ నల్లాని వెంకట రామారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement