వైభవంగా మల్లేశ్వరుడి గ్రామోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా మల్లేశ్వరుడి గ్రామోత్సవం

Feb 8 2026 4:05 AM | Updated on Feb 8 2026 4:05 AM

వైభవం

వైభవంగా మల్లేశ్వరుడి గ్రామోత్సవం

వైభవంగా మల్లేశ్వరుడి గ్రామోత్సవం

మంగళగిరి టౌన్‌: మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజులో భాగంగా ఉదయం స్వామివారికి పెళ్లికుమారుడి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. గణపతిపూజ, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవ మూర్తిని పెళ్లి కుమారుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి 7 గంటలకు మల్లేశ్వరుడి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామోత్సవంలో పెళ్లి కుమారుడిని దర్శించిన భక్తులకు పవిత్ర చేకూరి సకల శుభాలు అందుకుంటారనేది భక్తుల నమ్మకం. పట్టణానికి చెందిన జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతులు పెండ్లి కుమారునికి మధుపర్కాలు సమర్పించారు. మంగళగిరికి చెందిన అంబటి వెంకట సుబ్బారావు కుమారుడు విశ్వేశ్వరరావు, జక్కా వెంకటరత్నం కుమారుడు నాగ వెంకట గోపాలరావు స్వామివారి గ్రామోత్సవ కై ంకర్యపరులుగా వ్యవహరించారు. కార్యక్రమ ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు.

వైభవంగా మల్లేశ్వరుడి గ్రామోత్సవం 1
1/1

వైభవంగా మల్లేశ్వరుడి గ్రామోత్సవం

Advertisement
 
Advertisement
Advertisement