వెంకట సుబ్రహ్మణ్యంకు జీవన సాఫల్య పురస్కారం | - | Sakshi
Sakshi News home page

వెంకట సుబ్రహ్మణ్యంకు జీవన సాఫల్య పురస్కారం

Feb 7 2026 9:47 AM | Updated on Feb 7 2026 9:47 AM

వెంకట సుబ్రహ్మణ్యంకు జీవన సాఫల్య పురస్కారం

వెంకట సుబ్రహ్మణ్యంకు జీవన సాఫల్య పురస్కారం

వెంకట సుబ్రహ్మణ్యంకు జీవన సాఫల్య పురస్కారం

పెదకాకాని: గుంటూరు విశ్వనాథ సాహిత్య అకాడమీ దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, సాయి మంజీర కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కాజ వెంకట సుబ్రహ్మణ్యంకు విశ్వనాథ సాహిత్య అకాడమీ జీవన సాఫల్య పురస్కారం అందించారు. వీవీఐటీయూ చాన్సలర్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ చేతుల మీదుగా ప్రదానం చేశారు. మండల పరిధిలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. చాన్సలర్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌, అకాడమీ చైర్మన్‌ డాక్టర్‌ మద్దినేని సింహకౌటిల్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుబ్రహ్మణ్యం దంపతులను చాన్సలర్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ సత్కరించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ వేదాంతం రామలింగ శాస్త్రి బృందం ప్రదర్శించిన కూడిపూడి నృత్యనాటకం భక్తప్రహ్లాద ప్రేక్షకులను అలరించింది. అకాడమీ కార్యదర్శి మోదుగుల రవికృష్ణ. సభ్యులు పి.సత్యన్నారాయణరాజు, భూసురుపల్లి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement