శేష వాహనంపై మల్లేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

శేష వాహనంపై మల్లేశ్వరుడు

Feb 10 2026 7:45 AM | Updated on Feb 10 2026 7:45 AM

శేష వాహనంపై మల్లేశ్వరుడు

శేష వాహనంపై మల్లేశ్వరుడు

మంగళగిరిటౌన్‌ : మంగళగిరిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం మూడవరోజు స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామిని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు దాతలు ఆలయంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన కీర్తిశేషులు గోలి సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమారులు గోలి చిన్నారావు, గోలి నాగేశ్వరరావు, గోలి సాంబశివరావు, గోలి శ్రీనివాసరావు వ్యవహరించారు. దేవస్థాన ఈ.ఓ. గోపి ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement