ఏఆర్‌ బలగాలకు విజయవంతంగా శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఏఆర్‌ బలగాలకు విజయవంతంగా శిక్షణ

Feb 9 2026 7:45 AM | Updated on Feb 9 2026 7:45 AM

ఏఆర్‌ బలగాలకు విజయవంతంగా శిక్షణ

ఏఆర్‌ బలగాలకు విజయవంతంగా శిక్షణ

ఏఆర్‌ బలగాలకు విజయవంతంగా శిక్షణ

నగరంపాలెం: ఏఆర్‌ బలగాల శారీరక దృఢత్వం, ఆయుధాల వినియోగంలో నైపుణ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా శిక్షణ (మొబిలైజేషన్‌) నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. ఆదివారం పోలీస్‌ కవాతు మైదానంలో జిల్లా ఏఆర్‌ బలగాలకు డి–శిక్షణ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏఆర్‌ బలగాలకు శిక్షణ, డి–శిక్షణ నిర్వహించడం తప్పనిసరని అన్నారు. వీవీఐపీ, వీఐపీ కార్యక్రమాలు, విస్తృత బందోబస్త్‌ విధులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. పోలీస్‌ సిబ్బంది శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని అన్నారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్‌) హనుమంతు మాట్లాడుతూ ఏఆర్‌ బలగాలకు విజయవంతంగా శిక్షణ నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం ఏఆర్‌ బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పరేడ్‌ను జిల్లా భద్రత విభాగ ఆర్‌ఐ శ్రీనివాసరావు పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. జిల్లా భద్రత విభాగపు పోలీస్‌ జాగిలం (సింబా) ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాగిలం ప్రతిభను జిల్లా ఎస్పీ ప్రశంసించారు. కార్యక్రమంలో డీఎస్పీలు సంకురయ్య (ఏఆర్‌), అరవింద్‌ (గుంటూరు పశ్చిమ), సీఐలు నాగుల్‌మీరా, బిలాలుద్దీన్‌, ఆర్‌ఐలు శివరామకృష్ణ, శ్రీహరిరెడ్డి, సురేష్‌, శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌లు, ఏఆర్‌ బలగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement