ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ? | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?

Feb 9 2026 7:45 AM | Updated on Feb 9 2026 7:45 AM

ఇంటర్

ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?

ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ? గుంటూరు ఎడ్యుకేషన్‌ : గుంటూరు జిల్లాలో 68,941 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ఇంటర్‌ జూనియర్‌ 35,485, సీనియర్‌ 32,184 మందితోపాటు గతంలో పరీక్ష తప్పిన విద్యార్థులు 1,272 మంది ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి పల్నాడు, బాపట్ల జిల్లాలు విడిపోయిన అనంతరం గుంటూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఐదు, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఆరు ఉన్నాయి. ఆయా కళాశాలల్లోని అధ్యాపకులు ఇన్విజిలేషన్‌ విధులకు సరిపోని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇతర ఏ జిల్లాలోనూ లేని విధంగా గుంటూరులో సమస్యలు ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గతంలో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలను లక్ష మంది విద్యార్థులు రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం సైతం విద్యార్థుల సంఖ్య గుంటూరులోనే అధికంగా ఉంది. 18 మండలాలకు పరిమితమైనప్పటికీ ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు, హాస్టల్‌ క్యాంపస్‌లు గుంటూరు జిల్లాలోనే కేంద్రీకృతం కావడంతో దాదాపు 70 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలను ఏర్పాటు చేసిన ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారుల అంచనా ప్రకారం ఇన్విజిలేషన్‌ విధులకు 1,478 మంది అవసరం. 87 పరీక్ష కేంద్రాల పరిధిలో చీఫ్‌ సూపరింటెండెంట్‌, శాఖాధికారులుగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌తోపాటు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు, కాంట్రాక్టు అధ్యాపకులతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పీడీలు, ఆర్ట్‌, క్రాఫ్ట్‌ టీచర్లను నియమిస్తున్నారు. వీరితోపాటు ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లుగానూ వీరినే నియమించనున్నారు. గుంటూరు జిల్లాలోని 11 ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు చీఫ్‌ సూపరింటెండెంట్లుగా అదే కళాశాలలకు చెందిన ప్రిన్సిపల్స్‌ వ్యవహరిస్తారు. మిగతా 76 ప్రైవేటు జూనియర్‌ కళాశాలల పరీక్ష కేంద్రాలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని అధ్యాపకులను చీఫ్‌ సూపరింటెండెంట్‌, శాఖాధికారులుగా నియమించనున్నారు. అయితే ప్రైవేటు కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులను అదే కళాశాలల్లో ఇన్విజిలేటర్లుగా నియమించేందుకు చర్యలు చేపట్టారు. సంబంధిత సబ్జెక్టు పరీక్ష రోజున సదరు అధ్యాపకులు తాము పని చేస్తున్న కళాశాలలో ఇన్విజిలేటర్లుగా మాత్రం ఉండరాదని ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులు నిబంధన విధించారు.

23న ప్రారంభం కానున్న పబ్లిక్‌ పరీక్షలు గుంటూరు జిల్లాలో 87 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 68,941 మంది విద్యార్థులు ఇన్విజిలేటర్లుగా 1,478 మంది అవసరం పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి రప్పించేలా అధికారుల ఏర్పాట్లు

ఇతర జిల్లాల వారిని నియమిస్తాం

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణలో చీఫ్‌, డీవోలతోపాటు ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్లుగా నియమించేందుకు అధ్యాపకుల కొరత ఉంది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులను పంపాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. ప్రైవేటు కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో చీఫ్‌, డీవోలు, ఇన్విజిలేటర్ల నియామకంలో ఇంటర్మీడియెట్‌ బోర్డు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

– జి.సునీత, ఆర్‌ఐవో, గుంటూరు

ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో కీలకమైన ఇన్విజిలేషన్‌ విధులకు గుంటూరు జిల్లాలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న పబ్లిక్‌ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సైన్స్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు జరుగుతున్న ప్రాక్టికల్స్‌ ఈ నెల 10వ తేదీన ముగియనున్నాయి. థియరీ పరీక్షలపై దృష్టి సారించిన అధికారులకు ఇన్విజిలేటర్ల కొరత ఇబ్బందికరంగా మారింది.

జిల్లాలోనే అధికం

ప్రైవేటు అధ్యాపకులకు బాధ్యతలు

ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?1
1/1

ఇంటర్‌కు ఇన్విజిలేటర్లేరీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement