వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు ఈస్ట్, పశ్ఛిమ నియోజకవర్గాల పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ మువ్వెన్నల పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మహనీయుల త్యాగ ఫలితం కారణంగానే స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నందేటి రాజేష్, వంగల వలివీరారెడ్డి, ఈమని రాఘవరెడ్డి, పఠాన్ సైదాఖాన్, పఠాన్ అబ్దుల్లాఖాన్, ఉడుముల పిచ్చిరెడ్డి, కొలకలూరి కోటేశ్వరరావు, ఓర్సు శ్రీనివాసరావు, యేటి కోటేశ్వరరావు యాదవ్, మురళి, షరీఫుద్దీన్, కీసరి సుబ్బలు, తోటకూర స్వర్ణలత, వేలూరి అనిల్‌రెడ్డి, సత్తెనపల్లి రమణి, వెంకాయమ్మ, వాసిమళ్ళ విజయ్, కార్పొరేటర్‌లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, నగర, జిల్లా కమిటీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
జెండా వందనం చేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నేతలు


