నేటి నుంచి బార్ షాపులకు దరఖాస్తుల స్వీకరణ
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో నోటిఫై చేసిన బార్ షాపుల్లో ఖాళీగా ఉన్న వాటి నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం బుధవారం రీ నోటిఫికేషన్ జారీ చేసిందని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. బుధవారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గుంటూరు జిల్లాలో 42 బార్‌లకు, పల్నాడు జిల్లాలో 22 బార్‌లకు రీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 26, మున్సిపాలిటీల పరంగా మంగళగిరి 6, తెనాలి 9, పొన్నూరులో ఒకటి చొప్పున ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలు చెల్లించాలన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏడాదికి రూ.75 లక్షల లైసెన్స్ ఫీజు చెల్లించాలని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో రూ.55 లక్షల ఫీజు చెల్లించాలన్నారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ, 5న ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డ్రా తీసి షాపులు కేటాయిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి అరుణకుమారి, ఏఈఎస్ మారయ్య బాబు పాల్గొన్నారు.


