198 కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

198 కిలోల గంజాయి స్వాధీనం

Jan 31 2026 6:47 AM | Updated on Jan 31 2026 6:47 AM

198 కిలోల గంజాయి స్వాధీనం

198 కిలోల గంజాయి స్వాధీనం

బాపట్ల టౌన్‌: బాపట్ల జిల్లాలోని బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం రూ.25 లక్షల విలువైన 198 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. కాకినాడ జిల్లా తుని పరిసర ప్రాంతాల నుంచి తమిళనాడు రాష్ట్రానికి తరలివెళ్తున్న గంజాయిను మార్టూరు సమీపంలో స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్ణాటక రాష్ట్రం చామరాజ నగర్‌ జిల్లా కొల్లగల మండలం చంగవాడి గ్రామానికి చెందిన మంజునాథ ఈరప్ప హాల్డింగ్‌ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన కార్తీక్‌ హానుర్‌ రాజప్ప తాపీ పనిచేస్తుంటాడు. ఇద్దరు బంధువులు పైగా స్నేహితులు. వీరికి తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌లో పరిచయం అయ్యారు. అతని నిర్ణయం మేరకు ఈ ఇద్దరు ఈనెల 29న తుని పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తికి మధ్యవర్తిత్త్వం చేసుకొని అతనికి వాహనం, నగదు అందజేశారు. ఆ వ్యక్తి వీరు ఇచ్చిన వాహనంలో ఒక్కో ప్యాకెట్‌ రెండు కిలోల చొప్పున 198 కిలోల గంజాయిను 99 ప్యాకెట్లుగా తయారుచేసి వెంట తీసుకెళ్ళిన లోడ్‌చేసి వాహనాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అప్పగించారు. జిల్లా ఎస్పీకి అందిన సమాచారం మేరకు మార్టూరు సీఐ ఆధ్వర్యంలో పోలీసులు, ఈగల్‌ టీం సిబ్బంది బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద గంజాయి ఉన్న వాహనాన్ని సీజ్‌ చేయడంతోపాటు కర్ణాటకకు చెందిన ఇరువురు వ్యక్తులను అరెస్ట్‌ చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement