కిసాన్‌ సభ ఎగ్జిబిషన్‌ను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

కిసాన్‌ సభ ఎగ్జిబిషన్‌ను జయప్రదం చేయండి

Jan 29 2026 6:25 AM | Updated on Jan 29 2026 6:25 AM

కిసాన్‌ సభ ఎగ్జిబిషన్‌ను జయప్రదం చేయండి

కిసాన్‌ సభ ఎగ్జిబిషన్‌ను జయప్రదం చేయండి

లక్ష్మీపురం: అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు సందర్భంగా నేటి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్‌ జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ కోరారు. గుంటూరు బ్రాడీపేటలోని రైతు సంఘం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు సందర్భంగా 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతాయన్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఆర్‌.శారద జయలక్ష్మి దేవి ప్రారంభిస్తారని తెలిపారు, అనంతరం వికసిత్‌ భారత్‌ 2047 అనే అంశంపై ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్‌, మాజీ ఎంపీ మధు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, రిటైర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.వేణుగోపాలరావు, ఆర్‌.వీర రాఘవయ్య తదితరులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అనంతరం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించడానికి ప్రజా కళాకారుడు వంగపండు దుష్యంత్‌ వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ వారిచే వేమన సాంఘిక నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఎం.సూర్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement