ముగిసిన విజ్ఞాన్‌ బాల మహోత్సవ్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన విజ్ఞాన్‌ బాల మహోత్సవ్‌

Feb 3 2026 7:37 AM | Updated on Feb 3 2026 7:37 AM

ముగిస

ముగిసిన విజ్ఞాన్‌ బాల మహోత్సవ్‌

ముగిసిన విజ్ఞాన్‌ బాల మహోత్సవ్‌ ● ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లవరపు సూర్యతేజ మాట్లాడుతూ తాను చిన్నతనంలోనే ఐఏఎస్‌ కావాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నానని, అప్పటి నుంచి ఆ దిశగా నిరంతరంగా కృషి చేశానని, లక్ష్యం స్పష్టంగా ఉంటే మార్గం కూడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మాట్లాడుతూ చదువు క్రీడలను సమతుల్యంగా కొనసాగించడమే సంపూర్ణ అభివృద్ధికి మార్గమని సూచించారు. ● అండర్‌–17 మహిళల విభాగం వాలీబాల్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాలను పెదకూరపాడు జీఆర్‌సీఆర్‌కే హైస్కూల్‌, కేవీఎస్‌ఏపీ పీఎం శ్రీ స్కూల్‌లు సాధించాయి. ● కబడ్డీలో బాపట్ల, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, పిడుగురాళ్ల తిరుమల ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాలలు, చెస్‌లో మొదటి రెండు స్థానాలను బోయనపల్లి కుందన, సీహెచ్‌ దివ్యలు సాధించారు. ● అండర్‌–17 బాలుర విభాగంలో బాస్కెట్‌బాల్‌లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, శేకూరు జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలు నిలిచాయి. ● కబడ్డీలో బాపట్ల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, పిడుగురాళ్ల తిరుమల ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాలలు విజేతలుగా నిలిచాయి. ● 100 మీటర్లు పరుగు పందెంలో ఎస్‌కే మక్బుల్‌ హుస్సేన్‌, పి.మనోజ్‌, 800 మీటర్లు పరుగు పందెంలో ఎస్‌కే మక్బుల్‌ హుస్సేన్‌, బీ.నాగ మణికంఠలు, 4 ఇంటు 100 మీటర్ల రిలేలో ఏఆర్‌ఎస్‌ఆర్‌ఎం హైస్కూల్‌ జట్టు, ఏపీఆర్‌ఎస్‌ స్కూల్‌, రాజంపేట జట్టు విజేతలుగా నిలిచారు. ● లాంగ్‌జంప్‌లో పి.ప్రదీప్‌ కుమార్‌, పి.దేవకుమార్‌లు, షాట్‌పుట్‌లో బి.అశ్విన్‌, ఎం. నాగ అజయ్‌లు విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లవరపు సూర్యతేజ మహోత్సవ్‌ విజేతలకు ట్రోఫీలు, రూ.5 లక్షల నగదు బహుమతులు అందజేత

చేబ్రోలు: చిన్న వయసులోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని, క్రమశిక్షణతో శ్రమిస్తే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లవరపు సూర్యతేజ (ఐఆర్‌ఎంఎస్‌) అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి రెండో ఎడిషన్‌ ‘విజ్ఞాన్‌ బాల మహోత్సవ్‌–2కే26’ వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయి. బాల మహోత్సవ్‌ గెజిట్‌ పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రూ.5 లక్షల నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేశారు.

బాల మహోత్సవ్‌ 2కే26 విజేతలు వీరే...

రాష్ట్రస్థాయి విజ్ఞాన్‌ బాల మహోత్సవ్‌లో భాగంగా మొత్తం 50 ఈవెంట్లను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందించారు.

ముగిసిన విజ్ఞాన్‌ బాల మహోత్సవ్‌ 1
1/1

ముగిసిన విజ్ఞాన్‌ బాల మహోత్సవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement