అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటిన సిబ్బందికి ఎస్పీ అభినందనలు
నగరంపాలెం: గతనెల 30 నుంచి ఈనెల రెండు వరకు రాజస్థాన్ అజ్మీర్‌లోని పటేల్ సింథటిక్ స్టేడియంలో ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్స్ పోటీలు జరగ్గా, గుంటూరు జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. పలు పోటీల్లో పతకాలు సాధించిన ఏఆర్ హెచ్‌సీ ఎండీ షాహిదుల్లా (బంగారు పతకం), కానిస్టేబుల్ ఎం.లక్ష్మయ్య (వెండి పతకం), విశేష ప్రతిభ చాటిన ఏఎస్‌ఐ ఎం.సాంబశివరావును సోమ వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో పతకాలు సాధించి, జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు, ప్రతిష్టలు తేవాలన్నారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి పాల్గొన్నారు.


