బ్యాంక్‌ నిధుల దుర్వినియోగంలో మరొకరు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ నిధుల దుర్వినియోగంలో మరొకరు అరెస్ట్‌

Feb 4 2026 7:24 AM | Updated on Feb 4 2026 7:24 AM

బ్యాంక్‌ నిధుల దుర్వినియోగంలో మరొకరు అరెస్ట్‌

బ్యాంక్‌ నిధుల దుర్వినియోగంలో మరొకరు అరెస్ట్‌

నగరంపాలెం: జీడీసీసీ బ్యాంక్‌ (నల్లపాడు బ్రాంచ్‌)లో నిధుల దుర్వినియోగం కేసులో మరొకర్ని అరెస్ట్‌ చేశామని గుంటూరు సీసీఎస్‌ డీఎస్పీ బీవీ.మధుసూదనరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కేసు వివరాలను సీసీఎస్‌ డీఎస్పీ తెలిపారు. జీడీసీసీ బ్యాంక్‌ (నల్లపాడు బ్రాంచ్‌)లో నిధుల దుర్వినియోగంపై గతేడాది నవంబర్‌ 28న డివిజనల్‌ కో–ఆపరేటివ్‌ అధికారి కె.శీనారెడ్డి ఫిర్యాదుతో నల్లపాడు పీఎస్‌లో కేసు నమోదైందని అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఈ మేరకు ఏ–8 అయిన బాపట్ల టౌన్‌ పటేల్‌నగర్‌ రెండో వీధిలో ఉంటున్న పీటా వెంకటేశ్వరావు కదలికలపై నిఘా ఉంచామని అన్నారు. ఈనెల రెండో తేదీన అతన్ని గుంటూరు బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంక్‌ సమీపాన అరెస్ట్‌ చేశామన్నారు. గతంలో వెంకటేశ్వరరావు నల్లపాడు జీడీసీసీ బ్యాంక్‌ పాలకవర్గంలో సభ్యుడిగా నామినేట్‌ చేశారని తెలిపారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల న్యాయస్థాన కస్టడీకి ఆదేశించారని అన్నారు. పరారీలో ఉన్న కొందర్ని త్వరలో అరెస్ట్‌ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement