మూట్ కోర్టు పోటీల్లో విజేతగా ‘సత్యభామ’
గుంటూరు ఎడ్యుకేషన్: రెండు రోజులపాటు జేకేసీ కళాశాల రోడ్డులోని జేసీ లా కళాశాలలో నిర్వహించిన 5వ జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీల్లో తమిళనాడుకు చెందిన సత్యభామ స్కూల్ ఆఫ్ లా, ఈరోడ్ న్యాయ కళాశాల విద్యార్థి బృందాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో విజేతలుగా నిలిచాయి. ఆదివారం రాత్రి వరకు జరిగిన పోటీల్లో విజేతలకు వరుసగా రూ.37,500, రూ.30 వేలు చొప్పున నగదు బహుమతులను అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుధాకర్‌బాబు సోమవారం తెలిపారు. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కళాశాల కరస్పాండెంట్ వేమన కుప్పుస్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు.
మూట్ కోర్టు పోటీల్లో విజేతగా ‘సత్యభామ’


