నకిలీ పురుగు మందులు గుర్తించడం కీలకం
కొరిటెపాడు(గుంటూరు): నకిలీ పురుగు మందులు గుర్తించడంలో లాబోరేటరీలు కీలకంగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు మనజీర్ జిలాని సుమూన్ కోరారు. గుంటూరులోని పురుగుమందుల పరీక్ష కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. పురుగుమందుల శాంపిల్స్ పరీక్షా విధానం, విశ్లేషణ ఫలితాలు ఇన్‌సైట్ యాప్‌లో నమోదు చేయడంపై ఏడీఏ సీహెచ్ తిరుమలాదేవి, యనలిస్ట్‌లను అడిగి తెలుసుకున్నారు. మనజీర్ జిలాని సుమూన్ మాట్లాడుతూ పురుగుమందుల శాంపిల్స్‌ను తప్పిదాలు లేకుండా పరీక్ష చేసి, నకిలీ పురుగుమందులను అరికట్టాలని సూచించారు. గుంటూరు పురుగుమందుల ల్యాబ్‌కు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్(ఎన్‌ఏబీఎల్) వచ్చేలాగా కృషి చేయాలని ఆయన సూచించారు.


