ఆకతాయి చేష్టలతో ‘బాంబు’ కలకలం | - | Sakshi
Sakshi News home page

ఆకతాయి చేష్టలతో ‘బాంబు’ కలకలం

Feb 7 2026 9:47 AM | Updated on Feb 7 2026 9:47 AM

ఆకతాయి చేష్టలతో ‘బాంబు’ కలకలం

ఆకతాయి చేష్టలతో ‘బాంబు’ కలకలం

లక్ష్మీపురం: గుంటూరు వైద్య కళాశాలలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌లో ఫీడ్‌బ్యాక్‌ బోర్డుపై గుర్తు తెలియని యువకుడు శుక్రవారం అల్లాహు అక్బర్‌ భూమ్‌ అని రాసి బాక్స్‌లో వేయడంతో బాంబు అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగ్జిబిషన్‌కు పలువురు విద్యార్థులు వస్తున్నారు. వారి ఫీడ్‌బ్యాక్‌ కోసం బోర్డు ఏర్పాటు చేశారు. శుక్రవారం విజయవాడలోని నాగార్జున నర్సింగ్‌ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు వచ్చారు. ఫీడ్‌ బ్యాక్‌ బోర్డు వారిలో ప్రదీప్‌ సాహిత్య అనే యువకుడు ఇలా రాశాడు. బాంబు బెదిరింపు అనుకుని ఎగ్జిబిషన్‌ను కొద్దిసేపు నిలిపి వేశారు. నగరంపాలెం పోలీసులకు సమాచారం అందడంతో ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఓ యూట్యూబ్‌ చానల్‌కు చెందిన యువకుడు దీని గురించి అడిగి, బాంబు కలకలం అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. హైటెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. క్లూస్‌ టీమ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ కళాశాల ప్రాంగణం అంతా పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైరల్‌ అవ్వాలనే ఇలా చేసినట్లు చెప్పిన విద్యార్థి ప్రదీప్‌ సాహిత్యను మందలించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సొంత పూచీకత్తుపై పంపించేశారు. నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.

సోషల్‌ మీడియాలో

వైరల్‌ కోసం స్లిప్‌ రాసిన విద్యార్థి

Advertisement
 
Advertisement
Advertisement