అంబటి కుటుంబానికి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

అంబటి కుటుంబానికి పరామర్శ

Feb 6 2026 7:49 AM | Updated on Feb 6 2026 7:49 AM

అంబటి కుటుంబానికి పరామర్శ

అంబటి కుటుంబానికి పరామర్శ

అంబటి కుటుంబానికి పరామర్శ

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌): వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్సార్‌ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా కన్వీనర్‌ జయప్రకాష్‌ (జేపీ), ఉంగుటూరు కన్వీనర్‌ పప్పుల శ్రీనివాసరావు, నూజివీడు కన్వీనర్‌ మేకా ప్రతాప్‌ అప్పారావులు గురువారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంబటి ఇంటిపై, కార్యాలయంపై దాడికి వ్యూహరచన చేసిన టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలా విధ్వంసం సృష్టిస్తే పార్టీ శ్రేణులు భయపడతాయని అనుకోవడం టీటీపీ అవివేకం అన్నారు. అంబటి కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ధ్వంసమైన కార్యాలయాన్ని పరిశీలించారు. రాంబాబు ఇంటిని కాపు సీనియర్‌ నాయకుడు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు కూడా పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement