డీఆర్‌ఓ షేఖ్‌ ఖాజావలి | - | Sakshi
Sakshi News home page

డీఆర్‌ఓ షేఖ్‌ ఖాజావలి

Jan 30 2026 6:48 AM | Updated on Jan 30 2026 6:48 AM

డీఆర్‌ఓ షేఖ్‌ ఖాజావలి

డీఆర్‌ఓ షేఖ్‌ ఖాజావలి

ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కొనసాగుతుంది

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కొనసాగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్‌ ఖాజావలి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ మినీ సమావేశమందిరంలో రాజకీయపార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో డీఆర్వో మాట్లాడుతుతూ ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్‌లో భాగంగా ఓటర్ల జాబితాలోని డెమోగ్రాఫికల్‌ సిమిలర్‌ ఎంట్రీస్‌ను నెలరోజుల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా బూత్‌ లెవల్‌ ఏజెంట్‌లను నియమించుకొని వివరాలను అందించాలని రాజకీయపార్టీల ప్రతినిధులకు సూచించారు. ఓటరు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈఆర్వోలు, ఎఈఆర్వోలకు తెలిపారు. సమావేశంలో ఈఆర్వోలు డిప్యూటీ కలెక్టర్‌ గంగరాజు, నగరపాలక సంస్థ అదనపు కమిషనరు చల్లా ఓటులేసు, ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ మల్లేశ్వరి, ఏ ఈ ఆర్‌ వోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement