జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి
13వ అదనపు జిల్లా ఇన్‌చార్జి న్యాయమూర్తి కె.శ్యాంబాబు
నరసరావుపేట టౌన్ : జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని 13వ అదనపు జిల్లా ఇన్‌చార్జి న్యాయమూర్తి కె.శ్యామ్‌బాబు తెలిపారు. మార్చి 14న నిర్వహించే అదాలత్‌ను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక న్యాయాధికారులతో కోర్టు హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సివిల్ వివాదాలు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, ఫైనాన్స్ రికవరీ కేసులు, చెక్కు బౌన్‌న్స్ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కారం అయ్యే దిశగా కృషి చేయాలన్నారు. కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై న్యాయమూర్తులకు దిశానిర్దేశం చేశారు. వీలైనంత ఎక్కువ మంది కక్షిదారులకు లబ్ధి చేకూర్చేలా చొరవ చూపాలని కోరారు. కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృధా కాకుండా ఉభయ పక్షాల అంగీకారంతో వివాదాలను సామరస్యంగా ముగించుకోవడానికి ఈ లోక్ అదాలత్ ఒక చక్కటి వేదిక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయాధికారులు కె. మధుస్వామి, ఆశీర్వాదం పాల్, ఏ.సలోమి తదితరులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తెనాలిటౌన్: పట్టణ షరాఫ్‌బజార్‌లోని శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం స్వామివారిని సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ 28వ తేదీ ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్‌కుమార్‌లు మాట్లాడుతూ ఉత్సవాల్లో 31వ తేదీ రాత్రి సువర్చలా హనుమత్ కళ్యాణం, ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి రథోత్సవం, 2వ తేదీ ఉదయం చక్రస్నానం, పూర్ణాహుతి, 3వ తేదీ పుష్పోత్సవం, 4వ తేదీ తిరుప్పావడ సేవ, తదితర కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు.
లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కల్యాణ మహోత్సవం
దాచేపల్లి: లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామి కల్యాణ మహోత్సవం శుక్రవారం జరిగింది. స్థానిక చాపలగడ్డ బజారులో జరిగిన అమ్మవారి కల్యాణ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అభిషేకాలు చేసి అమ్మవారి గీతాలను మాలధారులు అలపించారు. అమ్మవారి కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు భక్తులు, మాలధారులకు అందించారు. కార్యక్రమంలో అమ్మవారి మాలధారణ ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నం సైదులు, గురుస్వామి బ్రహ్మయ్య, మౌలాలీ, గోపి తదితరులు పాల్గొన్నారు.
రేపు స్వామివారి తెప్పోత్సవం
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థనంలో ఆదివారం స్వామివారి తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాఘ పౌర్ణమి ఆదివారం ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు స్వామివారి దేవస్థానం నుంచి బయలు దేరి సీతానగరం ఆంజనేయస్వామి వారి దేవస్థానం వద్దకు ఉదయం 9 గంటలకు చేరుకుని, శ్రీ స్వామి వారి అమ్మవార్ల తిరుమంజనం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా నదిలో తెప్పోత్సం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి
జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి
జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి


