ఏఐ మోడల్‌తో సుస్థిర అభివృద్ధికి బలమైన పునాది | - | Sakshi
Sakshi News home page

ఏఐ మోడల్‌తో సుస్థిర అభివృద్ధికి బలమైన పునాది

Feb 3 2026 7:37 AM | Updated on Feb 3 2026 7:37 AM

ఏఐ మోడల్‌తో సుస్థిర అభివృద్ధికి బలమైన పునాది

ఏఐ మోడల్‌తో సుస్థిర అభివృద్ధికి బలమైన పునాది

ఏఐ మోడల్‌తో సుస్థిర అభివృద్ధికి బలమైన పునాది ● టెడ్‌ఎక్స్‌ స్పీకర్‌ ఎమినెంట్‌ ఇంజినీర్‌, ఫోర్బ్స్‌ 200 డీజీఈఎంఎస్‌, మాజీ ఏసీఎం ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ పద్మనాభుని మాట్లాడుతూ బయోటెక్నాలజీ రంగంలో ఔషధాల అభివృద్ధి, వ్యాధుల ముందస్తు గుర్తింపు, జీనోమ్‌ విశ్లేషణ, వ్యక్తిగత వైద్య సేవల రూపకల్పనలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. బెంగళూరులోని సీఐఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తన్వీర్‌ హసన్‌, అమృత విశ్వ విద్యాపీఠం ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ దేవనాథన్‌, ఐఐటీ మద్రాస్‌ సీఈఆర్‌ఏఐ ఏఐ పాలసీ హెడ్‌ డాక్టర్‌ గీతా రాజు, ఐఐటీ – ఏఐసీఓఈ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ కె.రుత్విక్‌, డిజిటల్‌ ఫ్యూచర్‌ ల్యాబ్స్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ హర్లీన్‌ కౌర్‌, వర్చువల్‌గా విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, విజ్ఞాన్‌ యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చేబ్రోలు: భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో, స్వదేశీ అవసరాలకు అనుగుణంగా రూపొందించే ఓపెన్‌ సోర్స్‌, లో రిసోర్స్‌ ఏఐ మోడళ్లు భవిష్యత్తులో సుస్థిర అభివృద్ధికి బలమైన పునాదిగా మారతాయని స్విస్‌నెక్స్‌ ఇన్‌ ఇండియా కంపెనీ అకడెమిక్‌ ఎంగేజ్‌మెంట్‌ హెడ్‌ లీనా మారైకే జోసెఫిన్‌ రోబ్రా అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ‘ కాన్‌క్లేవ్‌ ఆన్‌ రెస్పాన్సిబుల్‌ అండ్‌ సెస్టెయినబుల్‌ ఏఐ’ అనే అంశంపై సోమవారం సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ‘బిల్డింగ్‌ బెటర్‌ విత్‌ ఏఐ : సస్టేనబిలిటీ యాస్‌ ఏ బ్లూ ప్రింట్‌ ఫర్‌ ఇండియా’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్విస్‌నెక్స్‌ ఇన్‌ ఇండియా కంపెనీ అకడెమిక్‌ ఎంగేజ్‌మెంట్‌ హెడ్‌ లీనా మారైకే జోసెఫిన్‌ రోబ్రా మాట్లాడుతూ.. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతో రూపొందించే ఏఐ మోడళ్ల ద్వారా గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలకు కూడా ఆధునిక సాంకేతిక సేవలను అందించవచ్చని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement