వేతన సవరణ కమిషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వేతన సవరణ కమిషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

Feb 7 2026 9:41 AM | Updated on Feb 7 2026 9:41 AM

వేతన సవరణ కమిషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

వేతన సవరణ కమిషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

మంగళగిరి టౌన్‌: 12వ వేతన సవరణ కమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ అసోసియేషన్‌ (ఏపీ జీఈఎస్‌ఏ) రాష్ట్రప్రధాన కార్యదర్శి చాంద్‌ బాషా శుక్రవారం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా గత పీఆర్‌సీ ముగిసి 30 నెలలు అయినా నేటికీ ఉద్యోగులకు 12వ వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జరిగిన బడ్జెట్‌ సమావేశంలో 12వ వేతన సవరణ కమిషన్‌ ఏర్పాటు చేసి ఐఆర్‌ ప్రకటన చేస్తారని ఎదురుచూశారన్నారు. అలా జరగకపోవడంతో నిరాశకు లోనయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు డిసిప్లనరీ ప్రొసీడింగ్స్‌ పెండింగ్‌లో ఉండడం వల్ల వారికి పదోన్నతులు, పెన్షన్‌ బెనిఫిట్లు నిలిచిపోయాయని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసేవిధంగా ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్‌ విధానంపై ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఏపీ జీఈఎస్‌ఏ రాష్ట్ర

ప్రధాన కార్యదర్శి చాంద్‌బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement