గాయపడిన కార్యకర్తకు జగన్ భరోసా
గుంటూరు రూరల్: శనివారం రాత్రి విద్యానగర్‌లోని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాసం వద్ద టీడీపీ గూండాలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన ప్రత్తిపాడు నియోజకవర్గం బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్‌యాదవ్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అశోక్ వివరాలు తీసుకున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి అండగా ఉంటానని జగనన్న భరోసా ఇచ్చారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగరంలోకి రానుండగా.. స్వాగతం పలికేందుకు ఏటుకూరు బైపాస్‌లో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అశేష జనసందోహం ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నారు.. ఈక్రమంలో జాతీయ రహదారి నుంచి గుంటూరు నగరంలోకి వెళుతున్న అంబులన్స్ రావడంతో అంతా అడ్డుతొలగి.. స్వచ్ఛందంగా దారి ఇచ్చారు.
గాయపడిన కార్యకర్తకు జగన్ భరోసా
గాయపడిన కార్యకర్తకు జగన్ భరోసా


