మహాదత్తునికి విశేష పూజలు
ఫిరంగిపురం: మండలంలోని అమీనాబాద్ గ్రామంలో శ్రీ దత్తపీఠంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న విశేష పూజలు బుధవారంతో ముగిశాయి. ఉదయాన్నే అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో మహాదత్తహవనం చేసి పూర్ణాహుతి నిర్వహించి భక్తుల గోత్రాలతో పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం రెండు వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను శ్రీదత్తపీఠం నిర్వాహకులు జయశంకర్ పర్యవేక్షించారు.
వేమూరు: అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని బాలకోటేశ్వరస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. 2025 మార్చి 1వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 3వ తేదీ వరకు లెక్కింపు చేశారు. 11 నెలలకుగాను రూ.4,70,918 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ పావులూరు రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవదాయ ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, తెనాలి దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
నరసరావుపేట: ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించే కొండవీడు ఫెస్ట్ ద్వారా కొండవీడు వైభవాన్ని తిలకించేందుకు ప్రతి కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియా ద్వారా తన సందేశాన్ని రిలీజ్ చేశారు. తెలుగుజాతి ఘనచరిత్ర, వీరత్వానికి ప్రతీక కొండవీడు కోట అన్నారు. చరిత్ర, వైభవాన్ని నేటితరానికి పరిచయం చేస్తూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. హలీరైడ్, బోటింగ్, శాండ్ ఆర్ట్, లేజర్‌షో, క్రాకర్స్‌షో, హార్స్ రైడింగ్‌తో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. గాయకులు గీతామాధురి, సమీరా భరద్వాజ్, జబర్దస్ట్ కళాకారులు అలరించనున్నారని తెలిపారు. పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్‌మెంట్ పార్కు ఏర్పాటు చేశామన్నారు. పలు పోటీల్లో విద్యార్థులు పాల్గొని బహుమతులు పొందవచ్చన్నారు. అన్ని ప్రాంతాల తెలుగు వంటకాలతో ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి చూసి ఆనందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
పెదకాకాని: పెదకాకానిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలో జరగనున్న మహాశివరాత్రి ఏర్పాట్లను ఆర్‌జేసీ చంద్రశేఖర ఆజాద్ బుధవారం ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్‌తో కలిసి పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్‌లు, తాగునీరు, మజ్జిగ, పాలు సరఫరా పాయింట్లను పరిశీలించారు. మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులకు సాధారణ దర్శనాలు అందుబాటులోకి రావాలన్నారు. ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, వీఐపీలు స్వామి వారి దర్శనానికి వచ్చిన సమయంలో తగు ఏర్పాటు చేయాలని ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్‌కు సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని ఆర్‌జేసీ సూచించారు.
మహాదత్తునికి విశేష పూజలు
మహాదత్తునికి విశేష పూజలు
మహాదత్తునికి విశేష పూజలు


