దిగజారిన శాంతిభద్రతలు
రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. గూండాలు హత్యాయత్నాలకు పాల్పడుతున్నా పోలీసులు సైతం చూస్తూ ఊరుకునే పరిస్థితి నెలకొంది. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, అతని తొత్తులు చేసిన అసత్య ప్రచారం అంతా బూటకమని సీబీఐ తేల్చటంతో చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టేందుకు మరో అసత్య ప్రచారం ఫ్లెక్సీలతో చేయాలని చూశారు. తానే స్వయంగా క్యాబినెట్ మీటింగ్‌లో చెప్పటం చూస్తే రాష్ట్రం పరిస్థితి అర్థమవుతోంది. ఎమ్మెల్యే ఏకంగా ఇంటిపై దాడికి పాల్పడటం చూస్తే టీడీపీ గూండాలు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో తెలుస్తోంది. మాజీ మంత్రికి రక్షణ కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో బాబు, లోకేష్ రెడ్‌బుక్ పాలన నడుస్తోంది. కేవలం గూండాలకు అడుగులకు మడుగులు ఒత్తుతూ పోలీసులు సైతం దాడులను అడ్డుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో అత్యయిక పరిస్థితి నెలకొంది. గవర్నర్ పట్టించుకని ప్రజా రక్షణకోసం గవర్నర్ పాలన తీసుకురావాలి.
– బలసాని కిరణ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ ప్రత్తిపాడు సమన్వయకర్త


