మరో రకం డైవర్షన్ రాజకీయాలు
అంబటి రాంబాబు కారును అడ్డగించటం, ఇంటిపై దాడి చేయటం దారుణం. వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు. సీబీఐ కూడా లడ్డూలో కల్తీ లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసినా పోలీసులు వాటిని తొలగించలేదు. ఇదే విషయమై ప్రశ్నించిన అంబటి రాంబాబు కారును అడ్డగించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఇంటిపై దాడికి వెళ్లారు. తాను పరుషంగా మాట్లాడానేగానీ, చంద్రబాబును దూషించలేదని అంబటి రాంబాబు చెబుతున్నాఅరెస్టు చేయాలనటం దుర్మార్గం. లడ్డూప్రసాదంపై ఆరోపణలు అసత్య ప్రచారమని తేలటంతో మరో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను వివాదం చేయటం అందులో భాగం. – అన్నాబత్తుని శివకుమార్,
వైఎస్సార్ సీపీ తెనాలి సమన్వయకర్త


