రాష్ట్రంలో విధ్వంస పాలన
రాష్ట్రంలో విధ్వంస పాలన నడుస్తోంది. అందుకు నిలువెత్తు నిదర్శనం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పై టీడీపీ గూండాలు దాడి చేయటమే. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేక అత్యంత దుర్మార్గంగా ఇటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా... లేదా... అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గంటలపాటు దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరం. ఇంత దారుణమైన రీతిలో దాడులు చేసి వైఎస్సార్ సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారు. వీటికి ఏమాత్రం మేం భయపడం. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
– షేక్ నూరిఫాతిమా,
వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు


