కల్యాణ వేంకటేశ్వరుడికి హనుమంత వాహన సేవ
చిలకలూరిపేట: పట్టణంలోని పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి హనుమంత వాహన సేవ గ్రామోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో అగ్నిధ్యానం, నిత్యహోమం, బలిహరణ, మహాశాంతి హోమం వంటి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై 9వ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో హయగ్రీవ హోమం, హనుమద్వామన సేవ ఘనంగా జరిగాయని, స్వామి వారు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారని తెలిపారు. సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు అశ్వవాహన సేవ నిర్వహించామ ని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పా ల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదా లు స్వీకరించారని వెంకటాచార్యులు తెలిపా రు.
2న బుద్ధునితో నా ప్రయాణం నాటిక ప్రదర్శన
రేపల్లె:పట్టణంలోని గుత్తికొండ లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం ప్రదర్శించనున్న బుద్ధినితో నా ప్రయాణం, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ దృశ్య రూపకాన్ని ప్రతిఒక్కరూ తిలకించాలని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బాపట్ల జిల్లా అధ్యక్షుడు న్యాయవాది దారం సాంబశివరావు, ది ఆది ఆంధ్ర నవ బుద్ధిస్ట్ సొసైటీ కార్యదర్శి దోవా రమేష్ రాంజీలు కోరారు. వీటికి సంబంధించిన కరపత్రాలను పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. రేపల్లె ప్రాంతానికి చెందిన బౌద్ధ రచయిత బొర్రా గోవర్ధన్ సహకారంతో మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సౌజన్యంతో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే ఈ దృశ్య రూపకాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నియోజకవర్గ అధ్యక్షుడు ఆలూరి బిక్షాలు, నాయకులు బేతపూడి భాస్కరరావు, కూచిపూడి రవీంద్ర, కనపర్తి రవికిరణ్, బేతపూడి వెంకటేశ్వరరావు, రెబ్బా కోదండరాం, చెరుకూరి లక్ష్మణరావు, కర్రా బాబురావు, నలుకుర్తి శశి కుమార్, నీలా రాజ్ కుమార్, చందోలు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఉండవల్లి కళాకారుడికి అంతర్జాతీయ అవార్డు
తాడేపల్లి రూరల్: ఉండవల్లిలో నివాసం ఉంటున్న ఓ కళాకారుడికి అంతర్జాతీయ అవార్డు ప్రకటించడంతో తోటి కళాకారులు మంగళవారం అతడిని అభినందించారు. ఉండవల్లికి చెందిన దర్శకుడు గాదె నాగభూషణం రూపొందించిన జీవనధార లఘు చిత్రంలో నటించిన పులిగడ్డ సత్యనారాయణకు ఈ అవార్డు లభించింది. ఈనెల 31వ తేదీన హైదరాబాద్‌లో ఈ అవార్డును అందుకోవాలని సూచిస్తూ లేఖ అందడంతో ఉండవల్లిలో కళాకారుల్లో నూతన ఉత్తేజం పెరిగింది. ఈ సందర్భంగా గాదె నాగభూషణం మాట్లాడుతూ త్రినేత్ర ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో జీవనధార అనే లఘు చిత్రాన్ని రూపొందించామని అందులో నటించిన పులిగడ్డ సత్యనారాయణకు ఈ అవార్డు రావడం చాలా ఆనందించదగ్గ విషయమని, రోటరీక్లబ్ కళాచైతన్యం అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించిన తెలుగు షార్ట్ ఫిల్మ్ పోటీలలో ఈ అవార్డు లభించిందని పేర్కొన్నారు.
కల్యాణ వేంకటేశ్వరుడికి హనుమంత వాహన సేవ
కల్యాణ వేంకటేశ్వరుడికి హనుమంత వాహన సేవ
కల్యాణ వేంకటేశ్వరుడికి హనుమంత వాహన సేవ


