భవతీ బిక్షాం దేహీ | - | Sakshi
Sakshi News home page

భవతీ బిక్షాం దేహీ

Jan 28 2026 7:16 AM | Updated on Jan 28 2026 7:16 AM

భవతీ బిక్షాం దేహీ

భవతీ బిక్షాం దేహీ

బడ్జెట్‌ కేటాయింపులకు మించి

ఇష్టారాజ్యంగా పనులు మంజూరు

జెడ్పీటీసీల అంగీకారం లేకుండా

చైర్‌పర్సన్‌ ఏకపక్షంగా పనులు మంజూరు

నిధులు లేకుండా పనులు మంజూరుపై అధికారుల్లో ఆందోళన

స్టాంప్‌ డ్యూటీ సర్‌చార్జి నిధులు విడుదల చేయని టీడీపీ సర్కారు

కేంద్ర నిధులు మినహా పైసా విదల్చని చంద్రబాబు ప్రభుత్వం

రూ.26 కోట్ల పనులకు నిధుల లభ్యత లేకుండా అనుమతులు

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న జిల్లా పరిషత్‌

పైసా విదల్చని టీడీపీ సర్కారు

అప్పుల్లో జెడ్పీ

గుంటూరుఎడ్యుకేషన్‌:ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ అప్పుల్లో కూరుకుపోతోంది. జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా పనులకు అనుమతులు ఇచ్చేస్తున్న కారణంగా ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోంది. పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న జెడ్పీటీసీలకు తెలియకుండా, వారి అంగీకారం లే కుండా చైర్‌పర్సన్‌ ఏకపక్షంగా ఇస్తున్న అనుమతు లతో జెడ్పీ ఖజానా దివాళాకు చేరువైంది. జెడ్పీ ఆదాయ, వ్యయాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు, ఇతర ఆదాయ మార్గాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి పనులను రాజకీయ ప్రయోజనాలు, సొంత అవసరాలకు వాడుకోవడంతో జెడ్పీ పరిస్థితి దారుణంగా మారుతోంది. బడ్జెట్‌ కేటాయింపులకు మించి మంజూరు చేస్తున్న కారణంగా బిల్లులు చెల్లించే సమయంలో నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలం

సొంతంగా ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలమవుతున్న జెడ్పీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు తెచ్చుకోవడంలోనూ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. పాలకురాలి వ్యవహారశైలి కారణంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేస్తోంది. ప్రజల ఓట్లతో గెలిచి, పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న జెడ్పీటీసీలను పక్కనపెట్టి సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్న పాలకుల వైఖరి కారణంగా జెడ్పీని ప్రతిష్ట మసకబారుతోంది. ఫలితంగా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు పను లు చేయలేక, ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకుంటున్నా రు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులకు పెద్దపీట వేసి వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో జెడ్పీటీసీలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. మూడు నెలలకోసారి కొలువుదీరే స్టాండింగ్‌, జనరల్‌ బాడీ సమావేశాలకు హాజరై అజెండా ఆమోదానికి పరిమితమవుతున్న పరిస్థితుల్లో గత్యంతరం లేక రాజ్యాంగం కల్పించిన హక్కులను అస్త్రంగా వాడుకుంటున్నారు. తమ మండలాల్లో తమను సంప్రదించకుండా టీడీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ప్రాధ్యానం ఇస్తూ చైర్‌పర్సన్‌ సాగిస్తున్న ఏకపక్ష విధానాలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు సమావేశాలను అడ్డుకుంటున్నారు.

నిధుల లభ్యత, పనుల కేటాయింపుల్లో పొంతన శూన్యం

జెడ్పీలో నిధుల లభ్యత, కేటాయించిన పనులకు పొంతన ఉండటం లేదు. 15వ ఆర్థిక సంఘం సీపీడబ్ల్యూఎస్‌ పథకాల ద్వారా చేపట్టాల్సిన పనులకు సంబంధించి జెడ్పీకి 2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.19.51 కోట్లు కేటాయించింది. అయితే సీపీడబ్ల్యూఎస్‌ టైడ్‌, అన్‌టైడ్‌ కింద రూ.34.12 కోట్ల పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. ఈ విధంగా వచ్చే నిధులకు, మంజూరు చేసిన పనులకు పొంతన లేకపోవడం జెడ్పీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వేస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులు 8.84 కోట్లు కాగా, రూ.14.61 కోట్లు అదనంగా కేటాయింపులు జరిపారు. దీంతో సంబంధిత పనులకు చెల్లింపులు జరపడం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే జెడ్పీ సాధారణ నిధుల్లో సైతం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో నిధుల లభ్యత కేవలం రూ.2.90 కోట్లుగా ఉండగా, రూ.11.27 కోట్ల పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేశారు.

జెడ్పీ నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి మరింత ఆందోళనకరంగా ఉంది. జెడ్పీకి స్టాంప్‌ డ్యూటీ కింద ప్రభుత్వం నుంచి రూ.35 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చి న తరువాత కేవలం రూ.40 లక్షలు విదిల్చారు. జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంతో పా టు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సర నిధులకు సై తం పనులు కేటాయించేశారు. టీడీపీ ఎమ్మెల్యే లు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు జెడ్పీటీసీలతో చర్చించకుండా చైర్‌పర్సన్‌ ముందస్తుగా అనుమతులు ఇచ్చేయడంతో జెడ్పీలో ఆర్థిక ప్రణాళిక దిగజారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement