అభిమాన సంద్రం
ఉప్పొంగిన
●అంబటి ఇంటి దగ్గర జన కోలాహలం
●మాజీ సీఎం వైఎస్ జగన్ కోసం వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు ●ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూపులు
●పోలీసుల బారికేడ్లను దాటుకుని వచ్చిన అభిమానం
టెలిఫోన్ స్తంభం ఎక్కిన ఓ అభిమాని
బారికేడ్లను అడ్డంగా పెట్టి నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
గుంటూరు ఎడ్యుకేషన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనలో అభిమాన జనసందోహం ఉరకలెత్తింది. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బుధవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యలయం నుంచి బయల్దేరినప్పటి నుంచి గుంటూరు సిదార్థ నగర్‌లోని అంబటి నివాసం వద్ద రోడ్లన్నీ అభిమానుల కోలాహలంతో నిండిపోయాయి. టీడీపీ రౌడీమూకల దాడితో ధ్వంసమైన అంబటి రాంబాబు నివాసం, కార్యాలయాన్ని పరిశీలించి, ఆయన కుటుంబ సభ్యులకు అండగా నిలిచి, తానున్నానని భరోసా ఇచ్చేందుకు వస్తున్న తమ అభిమాన నేత వైఎస్ జగన్‌ను చూసేందుకు అభిమానులు వేలాదిగా చేరుకున్నారు.
ఆంక్షల చట్రాలు దాటుకుని..
ఉదయం 10 గంటల నుంచి అంబటి నివాసం దగ్గరకు వస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులను పోలీసులు బారికేడ్లను అడ్డంగా పెట్టి అడ్డుకున్నారు. సిద్ధార్థ నగర్‌కు వెళ్లే అన్ని రహదారులను మూసి వేసి, బారికేడ్లను అడ్డంగా పెట్టిన పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వస్తున్న నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అంబటి ఇంటికి వెళ్లనీయకుండా ఆపివేశారు. గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చుట్టుగుంట సెంటర్ నుంచి అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. వైఎస్ జగన్ రాక కోసం వేయికళ్లతో ఎదురు చూసిన అభిమానులు ఆయన వచ్చీ రావడంతోనే పోలీసుల బారికేడ్లను దాటుకుని వచ్చారు. అంబటి రాంబాబు నివాసంతో పాటు చుట్టుపక్కల వాళ్ల ఇంటి గోడలపైకి ఎక్కి తమ అభిమాన నేతను కనులారా చూశారు. అంబటి ఇంటిపైకి ఎక్కిన అభిమానులను చూసిన వైఎస్ జగన్ అభివాదం చేయడంతో పులకించిపోయారు. అంబటి రాంబాబు ఇంటికి సమీపంలోని ఇళ్లలోని ప్రజలు తమ డాబాలపైకి ఎక్కి వైఎస్ జగన్‌ను చూశారు. అంబటి ఇంటి వద్ద చెట్లు, గోడలు, మిద్దెలు ఎక్కిన అభిమానులు సీఎం, సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు.
అభిమాన సంద్రం
అభిమాన సంద్రం


