ప్రభలపై అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే చర్యలు
నరసరావుపేట టౌన్: ప్రభలపై అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో మధులత హెచ్చరించారు. ప్రభల నిర్వాహకులతో గురువారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న మహాశివరాత్రిని పురస్కరించుకొని కోటప్పకొండ వద్ద ప్రభలు ఏర్పాటు చేసే నిర్వాహకులు నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. ప్రతి ప్రభ దగ్గర అగ్నిమాపక శాఖ నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని నిర్దేశించిన సమయంలో కోటప్పకొండ వద్దకు చేరుకోవాలన్నారు.
మాట్లాడుతున్న ఆర్డీవో మధులత


