గుంటూరు
శుక్రవారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2026 నిమ్మకాయల ధరలు
సాగర్ నీటిమట్టం గుంటూరు ఎడ్యుకేషన్: మండల విద్యాశాఖాధికారుల పోస్టులను భర్తీ చేయడంలో టీడీపీ సర్కారు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి పాఠశాలలకు శాపంగా మారింది. రెగ్యులర్ ఎంఈవో పోస్టుల్లో సీనియార్టీ ప్రాతిపదికన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ)పై నియమించాల్సి ఉండగా, విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను నియమించడంతో విద్యాబోధన కుంటుపడుతోంది. ఎంఈవోలపై పని భారాన్ని తగ్గిస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతి మండలానికి కొత్తగా ఎంఈవో–2 పోస్టును మంజూరు చేశారు. ఈ విధంగా ఎంఈవోల విధులను విభజించి, బండెడు చాకిరీ నుంచి వారికి ఉపశమనం కలిగించారు.
గుంటూరు జోన్ పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని 147 మండలాల్లో ఎంఈవో–1, 2 పోస్టుల్లో పని చేస్తున్న వారు ఎవరి బాధ్యతలు వారు నిర్వరిస్తున్నారు. అయితే ఉద్యోగ విరమణతో ఖాళీగా మారిన ఎంఈవో పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయకపోవడంతో ఆయా ఖాళీల్లో హైస్కూల్ హెచ్‌ఎంలను ఎఫ్‌ఏసీలుగా నియమించడం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ఎంఈవో–1లుగా నియమించడంతో విద్యాబోధన కుంటుపడుతోంది. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన సమయంలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఎంఈవోలుగా వేర్వేరు మండలాలకు వెళ్లిపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను ఎంఈవో–1లుగా నియమించడంతో ఆయా పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టులు బోధించేందుకు ఉపాధ్యాయులు కరువయ్యారు. రాజకీయ సిఫార్సులతో గుంటూరులోని విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయం ద్వారా కొనసాగుతున్న ఈ వ్యవహారం ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర నష్టదాయకంగా మారింది. గుంటూరు జోన్ పరిధిలోని 147 ఎంఈవో–1 పోస్టుల్లో రెగ్యులర్ ఎంఈవోలు 30 మంది ఉండగా, మిగిలిన వారిలో హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఉన్నారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి వివిధ మండలాలకు ఎంఈవో–1లుగా వెళ్లిన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు తమ మాతృ పాఠశాలల వైపు కన్నెత్తి చూడటం లేదు. వేతన బిల్లుల డ్రాయింగ్‌తో పాటు పాఠశాలల పర్యవేక్షణ విధులను నిర్వర్తిస్తున్న ఎంఈవోలు వారంలో రెండు, మూడు రోజులు తమ సొంత పాఠశాలలకు వెళ్లి, కనీసం టెన్త్ విద్యార్థులకై నా విద్యాబోధన చేసేందుకు అవకాశమున్నా, విద్యార్థులను గాలికొదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి.
గెజిటెడ్‌గా ఉన్న ఎంఈవో పోస్టుల్లో నిబంధనల ప్రకారం అదే కేడర్‌కు చెందిన హెచ్‌ఎంలను నియమించాల్సి ఉండగా, టీడీపీ సర్కారు పాలనలో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఎంఈవో–1, 2 పోస్టుల భర్తీలో సీనియార్టీకి పాతర వేశారు. ఎంఈవో–1 పోస్టుల్లో ప్రభుత్వ, ఎంఈవో–2 పోస్టుల్లో జెడ్పీ యాజమాన్యంలోని హెచ్‌ఎంలు కొనసాగుతున్నారు. అయితే టీడీపీ సర్కారు పాలనలో సీనియార్టీకి పాతర వేసి హెచ్‌ఎంల కంటే జూనియర్లు అయిన స్కూల్ అసిస్టెంట్లను ఎంఈవో–1లుగా నియమించిన కారణంగా తమ కన్నా తక్కువ కేడర్‌లో ఉన్న వారితో కలసి విధులను సమానంగా పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల జీత, భత్యాల బిల్లుల డ్రాయింగ్ అధికారులుగా ఉన్న ఎంఈవో–1లు పాఠశాలల పర్యవేక్షణ సైతం వారి చేతుల్లో ఉంది. దీంతో గెజిటెడ్ అధికారులుగా ఉన్న హెచ్‌ఎంల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎంఈవోలతో సమాన కేడర్ కలిగిన హెచ్‌ఎంలను ఎంఈవోలుగా నియమించాల్సిన పరిస్థితులకు భిన్నంగా స్కూల్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించడంతో విద్యాబోధన కుంటుపడింది.
ఎంఈవో పోస్టుల్లో ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులనే ఎంఈవో–1 పోస్టుల్లో నియమించాలి. గెజిటెడ్ అధికారులుగా నిర్వర్తించాల్సిన విధులను స్కూల్ అసిస్టెంట్లకు అప్పగించడం సరికాదు. ప్రభుత్వ హైస్కూళ్ల హెచ్‌ఎంలను ఎంఈవోలుగా నియమించి, స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతులు కల్పించాలి.
– కె.మాల్యాద్రిరెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయ
సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
న్యూస్‌రీల్
పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు
ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్‌ఎంలనే నియమించాలి
హైస్కూళ్లలో కుంటుపడుతున్న విద్యాబోధన హెచ్‌ఎంలు నిర్వర్తించాల్సిన విధులు స్కూల్ అసిస్టెంట్లకు అప్పగింత ఎంఈవో–1 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు, ఎంఈవో–2 పోస్టుల్లో హెచ్‌ఎంలు టెన్త్ పరీక్షల వేళ సబ్జెక్టు టీచర్లు లేక హైస్కూళ్లలో ఇబ్బందులు గుంటూరు జోన్ పరిధిలో విద్యాశాఖాధికారుల ఇష్టారాజ్యం గత ప్రభుత్వంలో ఎంఈఓ–2 పోస్టులతో సాీఫీగా నడిపిన అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
హైస్కూళ్లలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను ఎంఈఓలుగా నియమించడంతో విద్యాబోధన కుంటుపడుతోంది. ఎంఈవో–2 పోస్టుల్లో సీనియర్ హెచ్‌ఎంలు ఉండటం, వారి కంటే జూనియర్లు అయిన స్కూల్ అసిస్టెంట్లను ఎంఈవో–1 పోస్టుల్లో నియమించడం వల్ల గందరగోళం నెలకొంది. హెచ్‌ఎం కేడర్‌లో ఉన్న వారినే ఎంఈవో పోస్టుల్లో నియమించాలి.
– కె.బసవ లింగారావు,
ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు
శుక్రవారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2026
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.3900, మోడల్ ధర రూ.3500 వరకు పలికింది.
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 545.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 511 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరుతోంది.
రాజకీయ సిఫార్సులతో....
పాఠశాలల వైపు కన్నెత్తి చూడని ఉపాధ్యాయులు
సీనియార్టీకి పాతర
7
1/8
గుంటూరు
2/8
గుంటూరు
3/8
గుంటూరు
4/8
గుంటూరు
5/8
గుంటూరు
6/8
గుంటూరు
7/8
గుంటూరు
8/8
గుంటూరు