సామాజిక స్పృహతో దంత వైద్యసేవలు అందించాలి
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అశోక్ దోబ్లే సిబార్‌లో ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, మెడల్స్ ప్రదానం
పెదకాకాని: క్రమశిక్షణ అధునాతన విద్యాబోధనలతో ఉత్తమ దంత వైద్యులను తీర్చి దిద్దుతున్న సిబార్ దంత విద్య, వైద్యం ప్రశంసనీయమని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అశోక్ దోబ్లే అన్నారు. గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడులోని సిబార్ దంత వైద్య కళాశాలలో గురువారం సిల్వర్‌జూబ్లీ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నేషనల్ డెంటల్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి డాక్టర్ అశోక్ దోబ్లే ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సిబార్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ డాక్టర్ ముక్కామల అప్పారావు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా భారత దంత వైద్య మండలి మెంబర్ డాక్టర్ పి.రేవతి, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ డాక్టర్ మురళీధర్ ముప్పరపు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గవర్నింగ్ బాడీ సభ్యులు డాక్టర్ లింగమనేని సుబ్బారావు, డాక్టర్ సునీల్, శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చివరిగా సిబార్ దంత వైద్య విద్యార్థులు ఫ్యాషన్ షోలు, సంగీతం, నృత్యాలతో అలరించారు.


