సంకల్పం ఉంటే.. సక్సెస్ మీ వెంటే
నందిని అగసారా మాట్లాడుతూ క్రీడల్లో ఉంటే చదువును అశ్రద్ధ చేస్తారనేది కేవలం అపోహ మాత్రమేనన్నారు. క్రీడాకారులకు క్రమశిక్షణ, సమయ పాలన ఎక్కువగా ఉంటాయన్నారు. దీనివల్ల వారు చదువులో కూడా ఇతరుల కంటే మెరుగ్గా రాణించగలరన్నారు. విద్యార్థులు తమ కెరీర్‌లో విజయం సాధించడానికి ఏకాగ్రత, అంకితభావం, కఠిన శ్రమ ఈ మూడింటిని పాటించాలన్నారు.
ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడు నవ్వుతూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ పక్క వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలన్నారు. ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగంలోకి వెళ్లి రాణించాలని సూచించారు.
విజ్ఞాన్ మహోత్సవ్ 2కే26లో నిర్వహించిన మొత్తం 80 ఈవెంట్లకు చెందిన విజేతలకు విలువైన నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేశారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రికెట్ చాంపియన్‌షిప్‌లో తిరుపతికి చెందిన మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) జట్టు విజేతగా నిలిచి రూ.50 వేల నగదు బహుమతి సాధించింది. రన్నరప్‌గా విజయవాడకు చెందిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ జట్టు నిలిచింది.
మహోత్సవ్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన 250కు పైగా కళాశాలల నుంచి 20 వేల మందికి పైగా విద్యార్థులు ఆయా క్రీడాంశాల్లో పాల్గొన్నారు.
చివరిగా విజ్ఞాన్ మహోత్సవ్–2కే26 గెజిట్ పుస్తకాలను ఆవిష్కరించారు.
విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ ‘ క్రీడల్లో ఓటమి అనేది బలంగా ఎదిగేందుకు లభించే గొప్ప అవకాశమని, ప్రతి అపజయం ఒక విజయంలాంటిదే.. అది మనల్ని రేపటి గెలుపునకు సిద్ధం చేస్తుంది’ అన్నారు. చదువులో రాణించే తెలివైన విద్యార్థులు ఒక్కోసారి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని, కానీ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఎప్పుడూ మానసిక ఉల్లాసంతో ఉంటారని తెలిపారు. కుంగుబాటుకు లోనైనప్పుడు పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం లేదా క్రీడల్లో పాల్గొనడం ద్వారా తిరిగి ఉత్తేజాన్ని పొందవచ్చన్నారు.
చేబ్రోలు: ‘జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పం ఉంటే రాణించవచ్చు, చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు ప్రతిభ చాటాలి’ అని 2025 ఏషియన్ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసారా పిలుపునిచ్చారు. వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన 19వ ఎడిషన్ జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్ శనివారం వైభవంగా ముగిసింది. ఆఖరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏషియన్ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసారా విచ్చేశారు.
సర్టిఫికెట్లు, మెమెంటోలతో పాటు రూ.15 లక్షల విలువైన నగదు బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమాలలో సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.


