మార్కెట్‌ కమిటీలు డీలా | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ కమిటీలు డీలా

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

మార్కెట్‌ కమిటీలు డీలా

మార్కెట్‌ కమిటీలు డీలా

● డిసెంబర్‌ మాసం చివరి నాటికి అంటే తొమ్మిది నెలల కాలానికి 47.68 శాతంతో రూ.69.76 కోట్లు వసూలయ్యాయి. ఇందులో రూ.51.15 కోట్లు గుంటూరు మార్కెట్‌ కమిటీ నుంచి వసూలు కాగా మిగిలిన ఏడు మార్కెట్‌ కమిటీల ద్వారా కేవలం రూ.18.61 కోట్లు వసూలు కావడం విశేషం. ● గుంటూరు మార్కెట్‌ కమిటీ లక్ష్యం రూ.115 కోట్లు కాగా, ఇప్పటి వరకు 44.48 శాతంతో రూ.51.15 కోట్లు సాధించారు. ● దుగ్గిరాల లక్ష్యం రూ.3.75 కోట్లు కాగా 74.23 శాతంతో రూ.2.78 కోట్లు వసూలు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ● తెనాలి లక్ష్యం రూ.7.65 కోట్లు కాగా 72 శాతంతో రూ.5.54 కోట్లు, పొన్నూరు లక్ష్యం రూ.8.38 కోట్లు కాగా 62.51 శాతంతో రూ.5.24 కోట్లు, ప్రత్తిపాడు లక్ష్యం రూ.4.45 కోట్లు కాగా 57.87 శాతంతో రూ.2.58 కోట్లు, ఫిరంగిపురం లక్ష్యం రూ.1.88 కోట్లు కాగా 24.90 శాతంతో రూ.0.47 కోట్లు, మంగళగిరి లక్ష్యం రూ.3.03 కోట్లు కాగా 59.87 శాతంతో రూ.1.81 కోట్లు, తాడికొండ లక్ష్యం రూ.2.17 కోట్లు కాగా 8.98 శాతంతో రూ.0.19 కోట్లు వసూలు చేశాయి. ● గత ఏడాది ఇదే సమయానికి రూ.83.44 కోట్లు మార్కెట్‌ ఫీజు వసూలు చేస్తే ఈ ఏడాది రూ.69.76 కోట్లు మాత్రమే వసూలు కావడం గమనార్హం. ● గత ఆర్థిక సంవత్సరంలో కన్నా ఈ ఏడాది రూ.13.68 కోట్లు మార్కెట్‌ ఫీజు వసూలు తగ్గింది. ఈ నేపథ్యంలోనే లక్ష్య సాధన దిశగా నడిపించడంలో ఆర్జేడీ, డీడీఎం, ఏడీఎంలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఫీజు వసూలులో వెనుకంజ

గడిచిన తొమ్మిది నెలల కాలానికి

ఆర్జేడీ, డీడీఎం, ఏడీఎంల ఉదాసీనతే

కొరిటెపాడు(గుంటూరు): వివిధ రకాల ఫీజు వసూలులో మార్కెట్‌ కమిటీలు డీలా పడ్డాయి. తెనాలి, దుగ్గిరాల, పొన్నూరు, మంగళగిరి, ప్రత్తిపాడు మార్కెట్‌ యార్డుల పరిస్థితి కొంత మేరకు మెరుగ్గానే ఉన్నా.. మిగిలిన తాడికొండ, ఫిరంగిపురం, గుంటూరు మార్కెట్‌ కమిటీల్లో వసూళ్లు బాగా తగ్గాయి. గుంటూరు జిల్లాలో ఉన్న 8 మార్కెట్‌ కమిటీలు, వాటి పరిధిలో ఉన్న 15 చెక్‌ పోస్టుల ద్వారా ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరానికి వివిధ రకాల ఫీజులు, అద్దెలు, సంతల ద్వారా రూ.146.31 కోట్లు వసూలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

లక్ష్య సాధనలో 47.68 శాతంతో సరి

కారణమని వినిపిస్తున్న విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement