వైఎస్‌ జగన్‌ పర్యటనను విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ పర్యటనను విజయవంతం చేయండి

Feb 4 2026 7:24 AM | Updated on Feb 4 2026 7:24 AM

వైఎస్‌ జగన్‌ పర్యటనను విజయవంతం చేయండి

వైఎస్‌ జగన్‌ పర్యటనను విజయవంతం చేయండి

వైఎస్‌ జగన్‌ పర్యటనను విజయవంతం చేయండి ● వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలు ● గుంటూరులో సన్నాహక సమావేశం

నగరంపాలెం: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బృందావన్‌ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలు, జిల్లా, నగర, రాష్ట్ర కమిటీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది. ఇటీవల హత్యాయత్నానికి గురైన వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ బుధవారం పరామర్శించనున్నారు. సిద్ధార్థనగర్‌లోని ఆయన నివాసానికి వైఎస్‌ జగన్‌ వస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్‌, లేళ్ళ అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు పార్లమెంట్‌ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్‌, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరిఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, సీఈసీ సభ్యుడు మందపాటి శేషగిరిరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్‌ గులాంరసూల్‌, పార్టీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement