మీ కోసం టోల్‌ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి
గుంటూరు మెడికల్: వైద్య ఆరోగ్య శాఖలో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రభుత్వం మీకోసం టోల్‌ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి శుక్రవారం తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఫిర్యాదు చేసేందుకు ఫ్రీ హెల్ప్ లైన్ నంబరు 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఈ ఫిర్యాదును ప్రభుత్వం నేరుగా పరిశీలిస్తుందన్నారు. వాటి పరిష్కారంపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందన్నారు. టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబరు 1100కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని ప్రజా కూడళ్లల్లో ప్రదర్శించాలన్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయం, ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయం, ప్రాథమిక ఆరో గ్య, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో టోల్‌ఫ్రీ నెంబరు అందరికి కనిపించే విధంగాడిస్‌ప్లే చేయాలన్నారు.
పంచముఖ గాయత్రీ ద్వాదశ
జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం వార్షికోత్సవం
తెనాలి టౌన్: కొలకలూరు సమీపంలోని పంచముఖ గాయత్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 10వ వార్షిక ప్రతిష్టా మహోత్సవాలు రెండురోజులపాటు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. విశ్వగాయత్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, శాశ్వత అధ్యక్షులు నంబూరు వెంకట కృష్ణమూర్తి నిర్వహణలో ఈ వేడుకలు నిర్వహించారు. వ్యవస్థాపక ధర్మకర్త నాగం నాగేంద్రరావు, సావిత్రి దంపతులు శాంతి హోమం జరిపించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని భక్తులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. ట్రస్ట్ కార్యదర్శి యర్రంశెట్టి హనుమంతరావు, కోశాధికారి వెలివెల రమేష్‌బాబు, సభ్యులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.
జిల్లా కోర్టు పబ్లిక్
ప్రాసిక్యూటర్‌గా చుక్కపల్లి
గుంటూరు లీగల్: గుంటూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా చుక్కపల్లి రమేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఉత్సవాల ఏర్పాట్లను
పరిశీలించిన కలెక్టర్
యడ్లపాడు: కొండవీడుకోట ఫెస్ట్ –2026 ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కొండవీడుకోటను సందర్శించారు. కొండకింద, వేదిక, ఫుడ్‌కోర్టులు, వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే స్టాళ్లు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే పోలీస్‌శాఖ నుంచి జిల్లా ఎస్పీ కృష్ణారావు పర్యవేక్షణలో డీఎస్సీ హనుమంతరావు, ముగ్గురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 180 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ తెలిపారు.
ఘనంగా శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆలయ వార్షికోత్సవం
చాగంటివారిపాలెం(ముప్పాళ్ల): చాగంటివారిపాలెం గ్రామంలోని శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆలయ వార్షి కోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించా రు. కార్యక్రమంలో భా గంగా ఉదయం స్వా మి వారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. స్వామికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మీ కోసం టోల్‌ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు
మీ కోసం టోల్‌ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు


