పోలీసుల పచ్చపాతం! | - | Sakshi
Sakshi News home page

పోలీసుల పచ్చపాతం!

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

పోలీస

పోలీసుల పచ్చపాతం!

పోలీసుల పచ్చపాతం!

అంబటి ఇంటి వద్ద పోలీసుల ఓవర్‌ యాక్షన్‌ నివాసానికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు నిన్న ఇదంతా ఏమైందంటూ వైఎస్సార్‌ సీపీ శ్రేణుల నిలదీత అంబటి కార్యాలయం, ఇంటి వద్ద పార్టీ నాయకులకు అడ్డంకులు

అంబటిపై రాళ్ల వర్షం.....

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద శనివారం పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర పోషిస్తూ టీడీపీ గూండాలకు అండగా నిలిచారు. అంతులేని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అదే పోలీసులు... ఆదివారం ఉదయం నుంచి అంబటి ఇంటి వద్ద ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వైసీసీ శ్రేణులతోపాటు అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చే వారిని కూడా అడ్డుకుంటూ అనధికారిక ఆంక్షలు విధించారు. అంబటిపై, ఆయన కార్యాలయంపై, ఇంటిపై, కుటుంబ సభ్యులపై టీడీపీ గూండాలు దాడి చేసిన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి విడుదల రజిని, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరి ఫాతిమా, వనమా బాల వజ్రబాబు, బలసాని కిరణ్‌, నాయకులు గుజ్జుల నాగార్జునరెడ్డి, పోతుల మహేష్‌, నాగార్జున యాదవ్‌, కారుమూరు వెంకటరెడ్డి, గులాం రసూల్‌, నిమ్మకాయల రాజనారాయణ, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అంబటి ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసులు అంబటి ఇంటికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులను లోపలికి రానివ్వకుండా అడ్డుకునే యత్నం చేశారు. దీంతో పోలీసులను పార్టీ కార్యకర్తలు నిలదీశారు. శనివారం రాత్రి అంబటి ఇంటి వద్ద సుమారు 7 గంటలకుపైగా టీడీపీ మూకలు విధ్వంసం సృష్టిస్తూ ఉంటే పోలీసు శాఖ వారికి అండగా నిలబడి మరీ దాడులు చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. కనీసం అడ్డుకునే యత్నం చేయకుండా వారికి పూర్తి మద్దతుగా నిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బారికేడ్లు అప్పుడు ఏమయ్యాయని నిలదీశారు. పోలీసులు ఇలా శనివారం కూడా వ్యవహరించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. పక్కా వ్యూహంతోనే ఇంతటి విధ్వంసం సృష్టించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరువైపుల బారికేడ్ల వద్ద లేళ్ళ అప్పిరెడ్డి, నాగార్జున రెడ్డి, బలసాని కిరణ్‌, గులాం రసూల్‌లను అడ్డుకోవడంతో పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు వెంటనే నిలదీయడంతో కార్యకర్తలను ఆపి, నేతలను మాత్రమే లోపలికి పంపించారు.

ఇంటి ముందు ఏడున్నర గంటల హైడ్రామా

శనివారం సాయంత్రం 4 గంటల నుంచి తెలుగు దేశం పార్టీ గూండాలు అర్ధరాత్రి 11.45 గంటల వరకు గంటలకుపైగా విధ్వంసం సృష్టించారు. టీడీపీ మూకలు, పార్టీ సామాజిక వర్గ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇష్టానుసారంగా అంబటి కార్యాలయం ముందు అసభ్య పదాలతో విరుచుకుపడ్డారు. స్వయంగా దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కోటేశ్వరరావు మైక్‌ సెట్‌తో, హిజ్రాలను తీసుకు వచ్చి పశ్చిమ ఎమ్మెల్యే... అంబటి ఇంటి ముందు తిష్ట వేశారు. మైక్‌లో అంబటిని, ఆయన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో సంభోదించారు. మరో వైపు టీడీపీ మూకలు గుణపాలు, రాళ్లు, కర్రలతో అంబటి ఇంటిపై, కార్యాలయంపై దాడి చేస్తుంటే పోలీసులు మాత్రం చోద్యం చూశారు. అంబటితోపాటు ఉన్న తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్‌, నిమ్మకాయల రాజనారాయణలతోపాటు మరో 50 మంది లోపల బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. పోలీసులు లోపలికి వచ్చి లైట్లు ఆపాలని, బయటకు కనిపించకుండా ఉండాలని చెప్పారేగానీ టీడీపీ మూకలను నిలురించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు.

డ్రోన్‌లతో నిఘా

అంబటి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించడంతోపాటు డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షించడంపై పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డ్రోన్‌ కెమెరాలో విజువల్స్‌ ఎవరికి చూపించడానికి లైవ్‌ కనెక్షన్‌ పెట్టారంటూ పార్టీ నాయకులు ప్రశ్నించారు. అంబటి ఇంటి ముందు నిలబడి ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ డ్రోన్‌ను ఎగురవేస్తూ ఎంతో శ్రద్ధగా వైఎస్సార్‌ సీపీ నాయకుల వీడియోను, ఫొటోలను తీయడంపై శనివారం ఎందుకు ఇలా కనిపించలేదని మండిపడ్డారు. పోలీసులు చోద్యం చూస్తూ ఉండటంపై ప్రజాసంఘాలు ఆగ్రహించాయి. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందని నిలదీశారు. రెడ్‌ బుక్‌ పాలనను పోలీసులు అనుసరిస్తున్నారా.. అంటూ ప్రజా సంఘాలు పోలీసు శాఖపై మండిపడుతున్నాయి.

అంబటిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు వజ్ర వాహనాన్ని ఆయన ఇంటి ముందుకు తీసుకొచ్చారు. టీడీపీ గూండాలను తరిమి కొట్టకుండా రెండు గంటలపాటు అలాగే ఉన్నారు. అంబటిని వాహనంలోకి ఎక్కించలేకపోయారు. తర్వాత రాంబాబు చుట్టూ పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి తీసుకు వెళుతున్న సమయంలో టీడీపీ మూకలు రాళ్లు, సోడా బుడ్డులు విసురుతూ విధ్వంసం సృష్టించారు. వజ్ర వాహనంలోకి పోలీసులు అంబటిని ఎక్కించిన తరువాత కూడా వారు వాహనాన్ని వెంటాడారు. అప్పటికి కూడా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

పోలీసుల పచ్చపాతం! 1
1/2

పోలీసుల పచ్చపాతం!

పోలీసుల పచ్చపాతం! 2
2/2

పోలీసుల పచ్చపాతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement