ఏఐ ఆలంబనగా సాయిశ్రీకర్‌ సృజన | - | Sakshi
Sakshi News home page

ఏఐ ఆలంబనగా సాయిశ్రీకర్‌ సృజన

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

ఏఐ ఆల

ఏఐ ఆలంబనగా సాయిశ్రీకర్‌ సృజన

తెనాలి: కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు...అదే కత్తితో పీకలు కోయొచ్చు...అంటారు! సోషల్‌మీడియా కూడా అటువంటిదే. ఎందరో దుర్వినియోగం చేసుకుంటూ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. సోషల్‌ మీడియాను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో సాధించవచ్చు...ఎందరి ప్రశంసలనో అందుకోవచ్చు...జీవితానికో బాట వేసుకోవచ్చు...అనేందుకు ఎన్నో ఉదాహరణలు.

తెనాలి నాజరుపేటకు చెందిన అచ్యుతుని సాయిశ్రీకర్‌ ఇందుకో నిదర్శనం. బీకాం చదివి, షార్ట్‌హ్యాండ్‌ ఉత్తీర్ణుడైన సాయిశ్రీకర్‌ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. షార్ట్‌హ్యాండ్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం మెండుగా ఉన్న ఈ యువకుడి దృష్టి, ఇటీవల అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై పడింది. స్వయంగా అధ్యయనం చేశాడు. తెలుగు భాషా పరిజ్ఞానం, పదాలతో పట్టు కలిగిన సాయి శ్రీకర్‌ తెలుగులో కవితాగానం చేయగలడు. కమ్మని పాటలను రచించగలడు. తన భాషా ప్రావీణ్యానికి ఏఐని ఆలంబన చేసుకున్నాడు. చక్కని పాట రాయడం, ఏఐతో ఆ పాటకు గానం, సంగీతం సమకూర్చటం, వీడియో ఎడిటింగ్‌ ప్రవేశం కూడా ఉండటంతో ఆ పాటకు సందర్భోచితమైన వీడియోలను తానే జత చేస్తున్నాడు. సినిమా పాటలను పోలిన గీతాలతో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఎవరి సాయం లేకుండా స్వయంసాధనతో చేసిన కృషికి అద్భుతమైన ప్రశంసలను అందుకుంటున్నాడు. తన తండ్రి జర్నలిస్టు కావటంతో తెలుగు పదాలతో చక్కని పాటలను రూపకల్పన చేయగలుగుతున్నానని తెలిపారు. నటన, సినిమారంగంపై అభిలాష కలిగిన తాను, గీత రచయితగానూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే భావనతో ఉన్నట్టు చెప్పాడు. ...మనమూ బెస్టాఫ్‌ లక్‌ చెబుదాం...

ఏఐ ఆలంబనగా సాయిశ్రీకర్‌ సృజన 1
1/1

ఏఐ ఆలంబనగా సాయిశ్రీకర్‌ సృజన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement