ఫొటోగ్రాఫర్ నాగేశ్వరరావుకు ద్రోణాచార్య సేవాపురస్కారం
తెనాలి: తెనాలి కెమెరా క్లబ్‌కు చెందిన ఫొటోగ్రాఫర్, శిక్షకుడు కోకాటి నాగేశ్వరరావు (నాగు) ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌లో ద్రోణాచార్య సేవా పురస్కారం స్వీకరించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ ఫంక్షన్‌హాలులో జరుగుతున్న మూడురోజుల ఫెస్టివల్‌లో ఆదివారం ఈ పురస్కారాన్ని జేఎన్‌ఏఎఫ్‌యూ (ఫొటోగ్రపీ), హైదరాబాద్ ప్రిన్సిపాల్ ఆనంద్, హెచ్‌ఓడీ కమల్‌రాయ్ చేతులమీదుగా బహూకరించారు. నాగేశ్వరరావును తెనాలి కెమెరా క్లబ్ సభ్యులు, పట్టణానికి చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అభినందించారు.


