ప్రజాస్వామ్యం ఉందా..
మాజీ మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ ఇటువంటి దాడులు చేసే వారు చేతకాని చవటలు, దద్ద మ్మలని విమర్శించారు. సీబీఐ స్పష్టంగా చార్జిషీటులో పేర్కొన్న తరువాత కూడా ఫ్లెక్సీలు వేస్తున్న వారిని కంటెంట్ ఆఫ్ కోర్టు కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబును గ్రంథాలయ సంస్థ చైర్మన్ పనిచేస్తున్న మహిళ చెప్పలేని రీతిలో బూతులు తిట్టిందని, మరీ ఆమైపె కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కొత్తగా గెలిచింది.. రాజకీయాలు ఏంటో త్వరలో తెలుస్తాయని హెచ్చరించారు.
ఒక మహిళ అయి ఉండి దగ్గరుండి అంబటి నివాసంపై దాడి చేయించటం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కాక ముందు జేబు దొంగతనాలు, రౌడీయిజం ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ సైతం సిగ్గుపడే విధంగా వ్యవహరిస్తోందని, సుమారు ఏడు గంటల పాటు దౌర్జన్యకాండ జరుగుతుంటే కనీసం వారిని నిలువరించక పోవటం బాధాకరమన్నారు. అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తామన్న పెమ్మసాని చంద్రశేఖర్‌కు.. వైఎస్ జగన్ వస్తే సినిమా ఎలా ఉంటుందో నిన్నటి పర్యటనతో అర్థమైనట్లు ఉందన్నారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అతి కిరాతకంగా జరిగిన దాడి.. రాక్షసులు ఒక మంచి వ్యక్తి పై చేసిన దాడిలా భావిస్తున్నామన్నారు. ఆలయానికి వెళ్లి వస్తున్న వ్యక్తిపై, అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ గురించి ప్రశ్నిస్తే.. పచ్చ మంద, తాగుబోతులు, గంజాయి బ్యాచ్ కలిసి బూతులు తిట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటిపై దాడి చేస్తే.. ఇక మాట్లాడే వారు ఎవరూ ముందుకు రారని దాడి చేయించారని మండిపడ్డారు. అంబటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి దాడులకు తాము ఏ మాత్రం భయపడమని తేల్చిచెప్పారు.
ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ నిన్న పెట్టిన సమావేశంలో లడ్డూలో కల్తీ లేదని తేల్చిన పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తోపాటు ఏ ఒక్కరి మొహంలో నెత్తురు చుక్క లేదని విమర్శించారు. రాక్షస రాజ్యం ఎలా ఉంటుందో.. చంద్రబాబు పాలన కూడా రాష్ట్రంలో అలాగే ఉందన్నారు. అంబటిపై భౌతికంగా దాడి చేయటం, పోలీసులు సైతం ఆయన్ని వేధింపులకు గురి చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర స్థాయిలో నిర్వహించిన ఒక సర్వేలో ఏపీ పోలీసుల స్థానం 36 ర్యాంకులో ఉందంటే.. వారి పని తీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు.
అసమర్థతను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా
అంబటిపై జరిగిన దాడి.. రాక్షస దాడి
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి
కూటమి నేతల ముఖాలలో నెత్తురు చుక్క లేదు
ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి
పట్నంబజారు(గుంటూరుఈస్ట్):రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా, లేక నియంతృత్వ పాలన సాగుతోందా అని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదాలు, అసమర్థతను ప్రశ్నిస్తే దాడులు..వారి వేధింపులకు గురి చేయటం సిగ్గుచేటని ఆగ్రహంవ్యక్తంచేశారు. పవిత్ర తిరుమల తిరుపతి లడ్డూను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తూ చంద్రబాబు ఇదేదో బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారని.. ఇదే వారికి భస్మాసుర హస్తం అని గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. శుక్రవారం గుంటూరు సిద్ధార్థనగర్‌లోని ఆయన నివాసంలో అంబటి కుటుంబ సభ్యులను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలిసి ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కార్యక్రమంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ నేతలు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యం ఉందా..
ప్రజాస్వామ్యం ఉందా..
ప్రజాస్వామ్యం ఉందా..


