హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి | Balaji Medamalli appointed as Additional Judge of High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి

Feb 11 2026 5:43 AM | Updated on Feb 11 2026 5:43 AM

Balaji Medamalli appointed as Additional Judge of High Court

రాష్ట్రపతి ఆమోద ముద్ర నోటిఫికేషన్‌ జారీ చేసిన 

కేంద్ర ప్రభుత్వం.. రెండు మూడు రోజుల్లో ప్రమాణం

సాక్షి, అమరావతి: హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి నియమితులయ్యా­రు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో అదనపు న్యాయమూర్తిగా బాలాజీ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్‌ శ్రీనివాసన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అదనపు న్యాయమూర్తిగా బాలాజీ రెండు మూడు రోజుల్లో ప్రమాణం చేసే అవకాశం ఉంది. 

హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు బాలాజీ పేరును సిఫారసు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానం కేంద్ర న్యాయశాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరింది. దీంతో బాలాజీ నియామకానికి రాష్ట్రపతి తాజాగా ఆమోద ముద్ర వేశారు. ఈ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది. ప్రస్తుతం హైకోర్టులో 32 మంది న్యాయమూర్తులుండగా, ఇందులో ఆరుగురు అదనపు న్యాయమూర్తులున్నారు.  

ఇదీ నేపథ్యం... 
బాలాజీ మెడమల్లి వైఎస్సార్‌ కడప జిల్లా, శేషన్నగారిపల్లికి చెందిన వ్యక్తి. లక్ష్మీనరసమ్మ, సుబ్బయ్యనాయుడు దంపతులకు 1972 మే 29న జన్మిం­ంచారు. వీరిది వ్యవసాయ కుటుంబం. కుటుంబంలో బాలాజీనే మొదటితరం న్యాయవాది. రాజంపేటలో ప్రాథమిక విద్యను, తిరుపతి శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాద్‌ పడాల రామిరెడ్డి లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు. 

1998లో హైకోర్టు న్యా­య­వాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. న్యాయవాది గూడ­పాటి వెంకటేశ్వరరావు వద్ద వృత్తి జీవితాన్ని ఆరంభించారు. గతంలో ఆయన ప్రభుత్వ సహా­య న్యాయవాదిగా వ్యవహరించారు. 2018–19 మధ్య కాలంలో విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్నారు. పలు సంస్థలకు, బ్యాంకులకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. బాలాజీకి భార్య కళ్యాణి, కుమారుడు సుచంద్రహాస్, కుమార్తె లక్ష్మీశ్వేత ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement