పచ్చటి కొండ కొల్లగొట్టు | TDP leaders remove hills in Chandrababu government | Sakshi
Sakshi News home page

పచ్చటి కొండ కొల్లగొట్టు

Mar 6 2026 5:09 AM | Updated on Mar 6 2026 5:09 AM

TDP leaders remove hills in Chandrababu government

కొండను తవ్వేసి చదును చేస్తున్న జేసీబీ

యంత్రాలతో యథేచ్ఛగా చదును పనులు

ఆక్రమణదారులుగా మండల టీడీపీ నాయకులు 

ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు  

పచ్చనేతలు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. అది అటవీశివారు గ్రామం.. ఆ ఊళ్లో కొండపై పచ్చనేతల కళ్లుపడ్డాయి.. రాళ్లు, కంకర, మట్టి యథేచ్ఛగా తరలించేస్తున్నారు. పచ్చటి కొండను కొల్లగొడుతున్నారు.. కాపాడాలని స్థానికులు కోరుతున్నా.. మామూళ్ల మత్తులో అధికారులు జోగుతున్నారు. ఫలితంగా ఆ ఎత్తైన కొండ కరిగిపోయింది. మిగిలిన హెచ్చుతగ్గులు చదునైపోయి రికార్డులు పుడుతున్నాయి. అయినా అడిగేవారు లేక.. అడ్డుకునే వారు రాక ప్రకృతి ప్రసాదితమైన కొండ మాయమైంది.  

సాక్షి, టాస్క్ ఫోర్స్‌: బాబు సర్కారులో పచ్చనేతలు కొండలను చదును చేసి.. పొలాలుగా మార్చేస్తున్నారు. అయినా అడిగేవారు కరువయ్యారు. వివరా ల్లోకి వెళితే..  తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపా ళెం మండలం నెరబైలు గ్రామ రెవెన్యూ లెక్క దాఖ లా సర్వే నంబర్‌ 160914లో ఉన్న 1.10 ఎకరాల గుట్టను గత పది రోజులుగా భారీ యంత్రాలతో ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే విలువైన మట్టిని బయటకు తరలించగా కొండ మొత్తం కరిగి పోయింది. ఆ నేలను చదును చేసి పంట పొలాలుగా తీర్చుతుర్చున్న ఘటనపై పలుసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఎత్తైన కొండ కళ్లముందే కరిగించేస్తున్నా అధికారులు స్పందించక పోగా ఆ భూముల కు అక్రమ మార్గంలో ఆక్రమణ దారుల పేరిట రికార్డులు సృష్టించేందుకు సాయం చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దీని వెనుక టీడీపీ మండలస్థాయి నేతలిద్దరితో పాటు గ్రామానికి టీడీపీ సాను భూతి పరులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.    

పల్లె రోడ్లు ఛిద్రం 
కొండను తవ్వి మట్టి యథేచ్ఛగా తరలిస్తుండడంతో పల్లె రోడ్లు ఛిద్రమవడంతోపాటు చుట్టు పక్కల పొలాలు సైతం దెబ్బతింటున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను లొంగతీసుకుని ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తుండడంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎత్తైన కొండలు, గుట్టలను తవ్వి పొలాలుగా మార్చుకోవడం, ఆపై రికార్డులు తయారు చేయడం నిరంతర ప్రక్రియగా మార్చుకోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతుండగా అన్ని రాజకీయ పారీ్టలు పోరాటాలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.  

అధికారులపై న్యాయ పోరాటం 
ప్రకృతి వనరులను ధ్వంసం చేసే భూ ఆక్రమణ దారులకు అండగా నిలుస్తున్న స్థానిక రెవెన్యూ అధికారులపై న్యాయ పోరాటం చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులందరికీ ఫిర్యాదులు చేశామని, భూ ఆక్రమణలు, ప్రకృతి వనరులను కాపాడడంలో మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement