వేట్లపాలెం ఘటనలో మరో ఇద్దరి మృతి | Two more die in Vetlapalem incident | Sakshi
Sakshi News home page

వేట్లపాలెం ఘటనలో మరో ఇద్దరి మృతి

Mar 6 2026 4:53 AM | Updated on Mar 6 2026 4:53 AM

Two more die in Vetlapalem incident

28కి చేరిన మరణాలు

కాకినాడ జీజీహెచ్‌లో మరొకరికి కొనసాగుతున్న చికిత్స 

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్‌­లో ఇటీవల జరిగిన ఘోర విస్ఫోటనంలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ పెద్దాపురానికి చెందిన మోర్త శ్రీను (30), వేట్లపాలేనికి చెందిన సప్ప సత్యవేణి (34) గురువారం మృతి చెందారు. 

బాణసంచా తయారీ కేంద్రంలో గత శనివారం జరిగిన పేలుడులో అక్కడికక్కడే 20 మంది సజీవ దహనమైన విషయం విదితమే. ఇదే ప్రమాదంలో గాయపడిన 9 మందిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇప్పటి వరకూ 8 మంది మృతి చెందారు. సామర్లకోట కుమ్మర వీధికి చెందిన వేమగిరి దావీదు మృత్యువుతో పోరాడుతున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement