హిందూ ధర్మంపై వైఎస్సార్‌సీపీ డాక్యుమెంటరీ | YSRCP Releases ‘Govindudu’ Documentary On Hindu Dharma And Tirumala Temple And Laddu Controversy, Watch Video Inside | Sakshi
Sakshi News home page

హిందూ ధర్మంపై వైఎస్సార్‌సీపీ డాక్యుమెంటరీ

Mar 5 2026 10:08 PM | Updated on Mar 6 2026 11:43 AM

YSRCP documentary on Hinduism

తాడేపల్లి : హిందూ ధర్మంపై వైఎస్సార్‌సీపీ డాక్యుమెంటరీ రూపొందించింది. ప్రధానంగా తిరుమల లడ్డూ అంశంతో పాటు మరిన్ని బురదజల్లే కార్యక్రమాలతో ఏడుకొండలను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తున్న నేపథ్యంలో గోవిందుడు పేరుతో డాక్యుమెంటరీ రూపొందించింది  వైఎస్సార్‌సీపీ.

గతంలో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీవారికి ఏడు కొండలు ఉండాలని, తిరుమల పవిత్రతను కాపాడుతూ అన్యమత ప్రచారంను నిషేధిస్తూ జీవోలు తెస్తే..  దానిపై చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా బురదజల్లారు. హిందూ ధర్మం కోసం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత నిబద్ధతతో పని చేస్తే.. ఓర్వలేనితనంతో చంద్రబాబు అబద్ధాలు చెప్పి నిందలు వేశారు. ఆఖరికి కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవారి లడ్డూపై అసత్యాలతో విష ప్రచారం చేసి హిందూ ధర్మానికి చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. వీటిన్నింటిపైనా వైఎస్సార్‌సీపీ డాక్యుమెంటరీ రూపొందించింది.

ధర్మాన్ని హననం చేసిన వారిని ఆ ధర్మమే హననం చేస్తుందని, భక్తి ముసుగులో  ద్రోహం చేస్తుంటే ఆ దేవదేవుడు ఊరుకుంటారా చంద్రబాబు?’ అని వైఎస్సార్‌సీపీ  ఈ  సందర్భంగా ప్రశ్నించింది. 

Advertisement
 
Advertisement
Advertisement