టిడ్కో ఇంటికి రూ.2 కోట్ల కరెంటు బిల్లు | Tidco house has an electricity bill of Rs 2 crore | Sakshi
Sakshi News home page

టిడ్కో ఇంటికి రూ.2 కోట్ల కరెంటు బిల్లు

Mar 6 2026 4:57 AM | Updated on Mar 6 2026 11:53 AM

Tidco house has an electricity bill of Rs 2 crore

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట జగ్గమ్మగారిపేటలో 18–9–­70 డోర్‌ నంబరు గల టి­డ్కో ఇంట్లో దాసరి దుర్గ ని­వాసం ఉంటున్నారు. ఆమె ఇంటికి రూ.1,99,91,809 కరెంటు బిల్లు వచ్చింది. అది చూసి దుర్గ ఒక్కసారిగా అవాక్కయ్యింది. తన ఇంటికి కరెంటు బిల్లు ఎప్పుడూ రూ.200 కూడా రాదని, అటువంటిది రూ.2 కోట్లు రావడమేమిటని ఆమె విలేకర్ల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏపీఈపీడీసీఎల్‌ ఏడీఈ కిరణ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా మీటర్‌ నంబరుతో రీడింగ్‌ పొరపాటున తీయడం వల్ల అంతమొత్తంలో బిల్లు వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. వెంటనే సరిచేసి రూ.147కు బిల్లు ఇచ్చామని వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement