
సాక్షి, వైఎస్సార్ జిల్లా: చిన్న కొత్తపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుల వీరంగం సృష్టించారు. మంత్రి సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై టీడీపీ నేతలు చేయి చేసుకున్నారు. ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లపై బెదిరిరింపులకు పాల్పడుతూ.. రెచ్చిపోతున్నారు. కర్రలతో కొడుతున్నారంటూ ఓటర్లు వాపోతున్నారు. ప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. బూతు పురాణం అందుకున్నారు. పక్క జిల్లా నుంచి ఒంటిమిట్టకు వచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. అసలు ఒంటిమిట్టకు సంబంధం లేకపోయినా కానీ మంత్రి హడావుడి చేశారు. మంత్రి వచ్చి.. పొలింగ్ బుత్‌లలో దౌర్జన్యం చేస్తున్నా కానీ పోలీసులు పట్టించుకోలేదు.
ఓటర్లను ప్రలోభపెట్టేలా.. ఒంటిమిట్ల పోలింగ్ బూత్‌లోకి మంత్రి వెళ్లారు, మరో వైపు, జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైఎస్ ఛైర్మన్ దొంగ ఓటు వేశారు. నల్లపురెడ్డి బూత్ క్యూలైన్‌లో నిలబడి వైఎస్ ఛైర్మన్ దొంగ ఓటు వేశారు. మరో బూత్ క్యూలైన్‌లో వేంపల్లికి చెందిన దొంగ ఓటరు ఓటు వేశారు. క్యూ లైన్‌లో జమ్మలమడుగు వాసులను వైఎస్సార్‌సీపీ శ్రేణులు గుర్తించాయి.